రాజీనామాతోనే చేరిక.. ఉప ఎన్నిక గ్యారంటీ అట

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి మారడం ఖాయం. మరికొద్దిరోజుల్లోనే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ఒక హాట్ హాట్ చర్చ [more]

Update: 2020-08-07 12:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి మారడం ఖాయం. మరికొద్దిరోజుల్లోనే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ఒక హాట్ హాట్ చర్చ జరుగుతుంది. గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వస్తానని గంటా శ్రీనివాసరావు చెప్పడంతోనే ఆయన ఎంట్రీ ఖరారయిందంటున్నారు.

రాజీనామా చేసే వస్తానని….

ఇప్పుడు గంటా శ్రీనివాసరావు చేత రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుంటే ఇబ్బంది ఉండదు. అక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఇబ్బంది ఉండదన్నది వైసీపీ అధిష్టానం ఆలోచన. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉప ఎన్నికలో సులువుగా గెలిచే వీలుందన్న అంచనాలో వైసీపీ ఉంది. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని చెబుతున్నారు. కానీ గంటా శ్రీనివసారావుకు మాత్రం తిరిగి టిక్కెట్ ఇవ్వబోరట.

తిరిగి టిక్కెట్ మాత్రం……

విశాఖ ఉత్తరం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో ఇటీవల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన కేకే రాజుకు టిక్కెట్ ఇవ్వాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచన. కేకేరాజు గెలుపు సులువవుతుంది. గంటా శ్రీనివాసరావును స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్మానించే వీలుంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికకు వెళ్లి గెలిచి అమరావతిపై విపక్షానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతోనే గంటా శ్రీనివాసరావు చేత రాజీనామా చేయించాలని డిసైడ్ అయ్యారంటున్నారు.

నామినేటెడ్ పదవితో….

రాజీనామాకు గంటా శ్రీనివాసరావు కూడా సిద్ధపడటంతో ఉప ఎన్నిక విశాఖ నగరంలో గ్యారంటీ అంటున్నారు. గంటా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కేకే రాజు విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేసి వెళితే తనపై కొంత గౌరవం కూడా పెరుగుతుందని గంటాశ్రీనివాసరావు భావిస్తున్నారు. అయితే విశాఖ ఉప ఎన్నికల్లో కేకే రాజు విజయం సాధిస్తే గంటా శ్రీనివాసరావుకు కేబినెట్ ర్యాంకు ఉన్న నామినేటెడ పోస్టు ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద గంటాశ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయం. దీంతో మరో ఆరు నెలల్లో ఏపీలో ఉప ఎన్నిక వస్తుందన్నది వాస్తవం.

Tags:    

Similar News