మాటల్లో మృదుత్వమే.. వ్యూహం మాత్రం?

గంటా శ్రీనివాసరావు అనతికాలంలో ఎదిగిపోయిన నేత. మాటలో మృదుత్వం ఉంటుంది. వ్యూహం మాత్రం పక్కాగా ఉంటుంది. తనకు ఏం కావాలో, అధినాయకులకు ఏమి ఇవ్వాలో బాగా తెలిసిన [more]

Update: 2020-03-18 12:30 GMT

గంటా శ్రీనివాసరావు అనతికాలంలో ఎదిగిపోయిన నేత. మాటలో మృదుత్వం ఉంటుంది. వ్యూహం మాత్రం పక్కాగా ఉంటుంది. తనకు ఏం కావాలో, అధినాయకులకు ఏమి ఇవ్వాలో బాగా తెలిసిన నాయకుడు. ఆయనకు అన్ని పార్టీలో మిత్రులు ఉన్నారు. పెద్దగా శత్రువులను తెచ్చిపెట్టుకునే నైజం గంటా శ్రీనివాసరావుకు లేదు. గంటాకు ట్రబుల్ షూటర్ అన్న పేరు కూడా ఉంది. ఆయన తమ పార్టీలో ఉండాలని అంతా కోరుకుంటారు. వైసీపీ కూడా అదే కోరుకుంది. గంటా శ్రీనివాసరావును ఆహ్వానించింది. ఆయన కూడా రావాలనుకున్నారు. అంతా అయిపోయాక మధ్యలో మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారని అంటారు. మొత్తానికి గంటా వైసీపీలో లేకుండానే జీవీఎంసీ ఎన్నికలు జరిగిపోతున్నాయి.

లోటు తీర్చేస్తారా…?

విశాఖ మేయర్ పీఠం వైసీపీ కల. ఎందుకంటే విశాఖను జయించాలన్నది జగన్ కి ఆరేళ్ళ కోరిక. ఇపుడు దాన్ని ఎవరు తీర్చినా మొనగాడే అవుతారు. జగన్ ఆ నమ్మకంతోనే అవంతిని మంత్రిని చేశారు. సామాజికవర్గం పరంగా బలమైన నేతగా అవంతి ఉన్నారు. అలాగే పదేళ్ళ రాజకీయ అనుభవం ఉంది. అయితే వీటితో పాటు ఇపుడు వ్యూహాలు కావాలి. ప్రత్యర్దులను చిత్తు చేయాలి. ఇది అవంతి వల్ల అవుతుందా అన్న వారికి లోకల్ బాడీ ఎన్నికలే సమాధానం చెబుతాయి. గెలిచి చూపించిన తరువాతనే అవంతి గ్రేట్ అనుకోవాలి.

గంటా తగ్గారా …?

నిజానికి గంటా శ్రీనివాసరావు మునుపటిలా ఉత్సాహంతో పార్టీలో లేరని టాక్. ఏం చేసినా మరో నాలుగేళ్ళ పాటు విపక్ష వాసం తప్పదు అన్న వైరాగ్యం ఆయనది. పైగా టీడీపీ తీరు చూసినపుడు అంత రిస్క్ తీసుకోవాలా అన్న ఆలోచన కూడా ఉందని అంటారు. బాబు తప్ప భవిష్యత్తు నాయకత్వం లేదు. 2024 నాటికి జగనే మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి. ఇవన్నీ గంటా శ్రీనివాసరావు ఆలోచనలు అంటారు. అందుకే ఆయన అన్నీ దాటుకుని మరీ వీరలెవెల్లో విజృభించడంలేదట.

అడ్వాంటేజేనా..?

గంటా శ్రీనివాసరావు అనుచరులంతా అస్త్ర సన్యాసం చేశారు. కొందరు వైసీపీలోకి నేరుగా చేరిపోతే మరికొందరు పార్టీని వీడి పరోక్షంగా సహాయం చేస్తున్నారు. ఈ నేపధ్యం వైసీపీకి పూర్తి అడ్వాంటేజ్ గా ఉంది దీన్ని సానుకూలంగా తీసుకుని వైసీపీ తగిన వ్యూహ రచనతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. మరి అవంతి ఆ పని చేయగలరా. ఆయనలో దక్షత ఏంటన్నది జీవీఎంసీ ఫలితాలే చెబుతాయి. పార్టీ మొత్తానికి తాను లీడర్ ని అని చెప్పగలిగే సామర్ధ్యం అవంతికి ఉందా, సవాళ్ళే నేతలకు మెరుగులు దిద్దుతాయి. ఇపుడు అవంతి కనుక అలా రాటుతేలితే కనుక విశాఖ జిల్లాలో మరో గంటా శ్రీనివాసరావు ఆవిర్భవించినట్లే.

Tags:    

Similar News