మళ్లీ మారడం ఖాయమే

గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఎవరికీ తెలియదు. చివరి నిమిషం వరకూ గంటా శ్రీనివాసరావు పోటీ ఎక్కడి [more]

Update: 2020-02-24 14:30 GMT

గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఎవరికీ తెలియదు. చివరి నిమిషం వరకూ గంటా శ్రీనివాసరావు పోటీ ఎక్కడి నుంచి అనేది ఎవరికీ తెలియదు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు నాలుగు సార్లు నాలుగు నియోజకవర్గాలను మార్చారు. భీమిలీ లో మంచి పట్టున్నా దాన్ని కాదనుకుని మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.

ఉత్తర నియోజకవర్గంలో…..

అయితే ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గంలో అడపా దడపా మాత్రమే పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ వేవ్ లోనూ గంటా శ్రీనివాసరావు బయటపడ్డారంటే ఆయన సన్నిహితులు, అనుచరుల ఎన్నికల మేనేజ్ మెంట్ మాత్రమేనని ఎవరిని అడిగినా చెబుతారు. ఒకసారి మేనేజ్ మెంట్ వర్క్ అవుట్ అయితే రెండోసారి కూడా అవుతుందని అనుకోవడం సరికాదన్నది గంటా శ్రీనివాసరావు అభిప్రాయమట.

ప్రతి ఎన్నికకూ…..

అందుకే ఆయన ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మార్చి వేస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి తన రాజకీయ ప్రస్థానంలో నాలుగు చోట్ల పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ఒకసారి పోటీ చేసి గెలిచినా మరోసారి అక్కడ పోటీ చేయకపోవడం గంటా శ్రీనివాసరావు విశిష్టత. 1999 ఎన్నికలలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయింది. 1999 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాదించారు.

ఈసారి కూడానా?

2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో మంత్రి పదవి చేపట్టారు. తర్వాత తిరిగి టీడీపీలో చేరిన గంటా శ్రీనివాసరావు భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ అతి తక్కువ మెజారిటీ రావడంతో వచ్చే ఎన్నికలకు గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మారుస్తారన్నది మాత్రం ఖాయంగా కన్పిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో కొంత యాక్టివ్ గానే కన్పిస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి ప్లేస్ మార్చేస్తారన్నది ఖాయంగా కన్పిస్తుంది. ప్రతిసారీ పార్టీయో, స్థానాన్ని మార్చడం గంటా శ్రీనివాసరావుకు సెంటిమెంట్ గా మారింది.

Tags:    

Similar News