ఆ పదవితో గంట కొడతారా ?

గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎపుడూ హాట్ టాపికే. ఆయనది రెండు దశాబ్దాల రాజకీయం. అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్న నాయకుడు. వీటికి మించి వ్యూహరచనలో సిద్ధహస్తుడు. రేపటి [more]

Update: 2020-10-25 03:30 GMT

గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎపుడూ హాట్ టాపికే. ఆయనది రెండు దశాబ్దాల రాజకీయం. అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్న నాయకుడు. వీటికి మించి వ్యూహరచనలో సిద్ధహస్తుడు. రేపటి రోజున రాజకీయం ఎలా సాగుతుందో అంచనా వేసుకోవడమే కాదు, అందులో తన పాత్ర ఏంటన్నది కూడా కచ్చితంగా ఫిక్స్ చేసుకుని మరీ పావులు కదిపే సమర్ధవంతమైన నేత. ఇవన్నీ ఇలా ఉంటే గంటా శ్రీనివాసరావు రాజకీయంగా ఇపుడు క్రాస్ రోడ్ జంక్షన్లో ఉన్నారు. ఆయన ఉన్న పార్టీలో పట్టించుకున్న వారు లేరు. వైసీపీలో చేరాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

వారితోనే సమస్యట….

ఇన్నాళ్ళూ గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి రాకపోవడానికి జగన్ కుడిభుజం లాంటి వాడు అయిన ఎంపీ విజయసాయిరెడ్డి అతి పెద్ద ఆటంకం అని అంతా భావించారు. కానీ ఇపుడు మాత్రం ఆయన సైడ్ ఇచ్చేశారు. జగన్ ఎలా అంటే అలాగే అంటూ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. గంటా శ్రీనివాసరావు కానీ మరొకరు కానీ పార్టీ బలోపేతానికి దోహదపడితే తాను అడ్డుచెప్పనని కూదా ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. అదే సమయంలో గంటా కూడా విజయసాయిరెడ్డి పెద్దరికాన్ని గురించి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దాంతో ఇక గంటా చేరిక రేపో మాపో అని అంతా అనుకున్నా కూడా ఇపుడు ఆయన సొంత సామాజికవర్గానికే చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. గంటా శ్రీనివాసరావు వస్తే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆందోళనతోనే వారు నో చెబుతున్నారట.

రాజీనామాకైనా….?

ఈ ఇద్దరూ గురుశిష్యులు అన్న సంగతి కూడా తెలిసిందే. ఇక అవంతికి మంత్రివర్గ విస్తరణలో పదవి ఇవ్వకపోతే తనకు చాన్స్ వస్తుందని గుడివాడ కాచుకుని కూర్చున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు కనుక వైసీపీలోకి వస్తే గ్యారంటీగా మంత్రిపదవిని తన్నుకుపోతారన్న ఆవేదన అమరనాధ్ లో ఉందని చెబుతున్నారు. దాంతో ఆయన గంటా శ్రీనివాసరావు వస్తే తాను పార్టీలో ఉండనని చెబుతున్నారుట. పైగా గంటాకు అనకాపల్లి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వర్గం కనుక బలోపేతం అయితే తనకు అసలుకే ఎసరు తప్పదని అని ఆయన కలత చెందుతున్నారుట. దాంతో రాజీయే లేదు. అవసరం అనుకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామని చెబుతున్నారుట. ఇక మంత్రి అవంతి కూడా గంటా శ్రీనివాసరావు కనుక వైసీపీలో చేరితే తాను సహించబోనని అంటున్నారు. అందుకోసం ఎంతటి తీవ్ర నిర్ణయం అయినా తీసుకుంటానని అంటున్నారుట.

ఆ పదవితోనైనా…?

ఇక గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వకుండా క్యాబినేట్ ర్యాంక్ పదవిని ఇచ్చి సంతృప్తి పరచాలని వైసీపీ పెద్దలు రాయబేరం నడుపుతున్నారని టాక్. గంటా కు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఎటూ ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించిందువల్ల ఆ పదవి ఇపుడు ఖాళీగా ఉంది. దాంతో ఆ సీట్లో ఆయన్ని కూర్చోబెడితే ఏ సమస్యలూ ఉండవని ఆలోచిస్తున్నారుట. అపుడు అవంతి, అమరనాధ్ కూడా సర్దుకుంటారేమోనని భావిస్తున్నారుట. మొత్తానికి గంటా శ్రీనివాసరావు ఏ పదవితో వైసీపీలో గంట కొడతారు అన్నది హాట్ టాపిక్ గా ఉంది మరి.

Tags:    

Similar News