Ganta : గంటాకు రివర్స్ లో సినిమా చూపిస్తారట

సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లా? లేనట్లా? ఒకరకంగా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లే. మరోరకంగా ఆయనను పార్టీ దూరం పెట్టినట్లే అనుకోవాలి. గంటా శ్రీనివాసరావును [more]

Update: 2021-11-01 03:30 GMT

సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లా? లేనట్లా? ఒకరకంగా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లే. మరోరకంగా ఆయనను పార్టీ దూరం పెట్టినట్లే అనుకోవాలి. గంటా శ్రీనివాసరావును ఇప్పుడు చంద్రబాబు దూరం పెట్టారు. ఇది నిజం. ఇలాంటి నేతలు పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం అంటే లెక్కలేని తనం లేనివాళ్లను ఉపేక్షించేది లేదని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

అప్పటి నుంచి….

గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికలలో గెలుపొందారు. అతి తక్కువ ఓట్లతో ఆయన విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి నుంచి ఆయన నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. తన మేనల్లుడిని నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారనే చెప్పాలి. ఆయన పై తరచూ పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన కాదని చెప్పరు. అవునని చెప్పరు. దీంతో ఆయన టీడీపీలో ఉంటారా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతుంది.

బాబు గుర్రుగా…

కాగా చంద్రబాబు గత కొద్దికాలంగా గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పడు పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేయడంపై చంద్రబాబు గంటాపై అసహనంతో ఉన్నారు. ఆయన పార్టీలో లేకపోయినా పరవాలేదు అన్న నిర్ణయానికి వచ్చారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు జరిపిన దాడిని గంటా శ్రీనివాసరావు ఖండించారు.

దీక్షకు కూడా….

కానీ గంటా శ్రీనివాసరావు చంద్రబాబు దీక్షకు మద్దతుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి రాలేదు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి ఏడాదిన్నర పైగానే అవుతుంది. పీఏసీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరు ప్రకటించనంత వరకూ ఆ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవి దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. గంటా పూర్తిగా పార్టీని వదలేశారని భావించిన చంద్రబాబు ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించారు.

Tags:    

Similar News