గంటా స్ట్రాటజీని మార్చడంతో?

ప్రస్తుతం విశాఖప‌ట్నం ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. వ్యూహం మార్చారా ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి .. [more]

Update: 2021-09-12 15:30 GMT

ప్రస్తుతం విశాఖప‌ట్నం ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. వ్యూహం మార్చారా ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి .. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మార్చుకు నేందుకు ప్రయ‌త్నిస్తున్నారా ? అంటే.. అవున‌నే చ‌ర్చలు విశాఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేర‌కు.. విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే..ఆయ‌న ఎక్కడ నుంచి పోటీ చేసినా.. గెలుస్తార‌నే అంచ‌నాలు ఉన్నందున‌.. ఉత్తరం సీటు టీడీపీ ఖాతాలో పడుతుంద‌నే లెక్కలు ముందుగానే వేసుకున్నారు. అయితే వాస్తవంగా ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ గ‌త ఎన్నిక‌ల్లో భీమిలి బ‌రిలోకి దిగ‌డంతో ఆయ‌న‌తో ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలోనే గంటా విశాఖ ఉత్తరంకు మారారు.

ఇద్దరితో గ్యాప్…..?

అయితే గంటా శ్రీనివాస‌రావుకు ఇప్పు డు ఉత్తర నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. ఎక్కడా ఆయ‌న ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కూడా ఎక్కడా ప‌నులు చేప‌ట్టడం లేదు. అటు పార్టీకి కూడా దూరం దూరంగా ఉంటున్నారు. పైగా చంద్రబాబు, చిన‌బాబుతో ఆయ‌న‌కు పెద్ద గ్యాప్ వ‌చ్చేసింది. దీంతో గంటా శ్రీనివాస‌రావు ఉనికి ప్రత్యేకంగా.. ఎక్కడా క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక జ‌న‌సేన + బీజేపీ కాంబినేష‌న్ ఉంటే విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు కూడా గ‌ట్టి ప్రత్యర్థే. మ‌రోవైపు వైసీపీ ఇన్‌చార్జ్ కెకె. రాజు చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో నార్త్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.

కుమారుడిని బరిలోకి….

దీంతో గంటా శ్రీనివాసరావు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. త‌న‌కు క‌లిసి వ‌చ్చిన భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం కోసం చూస్తున్నా ర‌ట‌. పోనీ.. తాను పోటీ చేయ‌క‌పోయినా.. త‌న కుమారుడుని.. ఇక్కడ నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్నార‌ట‌. అస‌లు గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న కుమారుడు ర‌వితేజ‌ను చోడ‌వ‌రం నుంచి పోటీ చేయించాల‌నుకున్నా కుద‌ర్లేదు.

గతంలో మాదిరి….

ఒక‌వేళ ర‌వితేజ‌కు కుద‌ర‌ని ప‌క్షంలో తాను ఖ‌చ్చితంగా భీమిలి నుంచి పోటీ చేయాల‌ని గంటా శ్రీనివాస‌రావు ప్రయ‌త్నంలో ఉన్నార‌ట‌. భీమిలి అయితేనే త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని.. ఉత్తరంలో ఎదుర‌వుతున్న ప‌రిణామాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చంద్రబాబు గంటా శ్రీనివాస‌రావు ప్లాన్‌కు ఓకే చెప్పడం గ‌తంలో అంత సులువు కాద‌నే అంటున్నారు.

Tags:    

Similar News