గంటాకు కాపు కాయకుండా బ్రేకులా ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలస [more]

Update: 2021-05-06 05:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చారు. ఇక ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆమెను వివాహం చేసుకున్న సంగతి అయితే చాలా మందికి తెలియదు. కానీ ఆయన అచ్చమైన కాపు నాయకుడు అని భావిస్తారు. అయితే వేరే కులానికి చెందిన వారికి చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. అంతే కాదు ఆయనకు టీడీపీ రాజకీయాల్లో కూడా అది చాలా ఉపయోగపడిందని కూడా చెబుతారు. ఇదిలా ఉంటే అటు టీడీపీకి దూరంగా ఇటు వైసీపీలో చేరకుండా గంటా శ్రీనివాసరావు సొంత పాలిటిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

రచ్చ చేశారుగా …?

ఇక గంటా శ్రీనివాసరావుని రాజకీయాల్లో నిత్యం విమర్శించే వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి ముందుంటారు. ఇపుడు ఆయన అనూహ్యంగా గంటా సతీమణి శారదను కూడా వివాదంలోకి లాగేశారు. గంటా భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నపుడు సింహాచలం దేవస్థానంలో అవసరమే లేకపోయినా కూడా పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఏకంగా సింహాచలం దేవస్థానం ఖజానాకు కూడా పెనుభారంగా మారిందని అన్న మాట ఉంది. వారిని ఇపుడు తీసేయడానికి వైసీపీ చూస్తూంటే పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి. దాంతో విజయసాయిరెడ్డి దీని మీద గట్టిగానే గంటా శ్రీనివాసరావును తగులుకున్నారు. ఇదంతా చేసింది గంటా సతీమణి మేడం చౌదరి గారు అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. ఈ పోస్టుల భర్తీ వెనక ఆమె ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అదిపుడు రాజకీయ రచ్చగా మారుతోంది.

వ్యూహాత్మకంగానేనా…?

గంటా శ్రీనివాసరావు తనకు ఉన్న బలమైన కాపుల దన్ను చూసుకుని ఫ్యూచర్ పాలిటిక్స్ చేద్దామని ఆలోచిస్తున్నారు. ఆయన ఏపీవ్యాప్తంగా కాపులకు తాను పెద్ద నాయకుడిని అని కూడా ఫీల్ అవుతారు. అటువంటి గంటా శ్రీనివాసరావు సగం కాపు తప్ప పూర్తి కాపు కాదు అన్నది చెప్పాలన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి ఈ రకంగా ఆయన వైవాహిక బంధం వెనక ఉన్న కులం గుట్టు విప్పారు అన్న మాట వినిపిస్తోంది. ఇంతకాలం గంటాను విమర్శించే ఆయన ఇపుడు ఏకంగా ఆయన సతీమణిని కూడా వివాదంలోకి లాగడం వెనక రాజకీయ ఎత్తుగడలే ఉన్నాయని చెబుతున్నారు.

మంటగా ఉందా…?

గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని మొదట చెప్పింది విజయసాయిరెడ్డే. మరి లోపాయికారిగా ఏం జరిగిందే తెలియదు విజయసాయిరెడ్డి అంతటి వాడు మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఆయనకు ఆధారాలు ఉంటాయి కదా అన్న మాట ఉంది. అయితే సాయిరెడ్డి ప్రకటించిన తరువాత గంటా శ్రీనివాసరావు తాను వైసీపీలో చేరడంలేదు అని ఖండించేశారు. దాంతో వైసీపీ పరువు పోయింది. ఇక జగన్ నుంచి కూడా ఈ విషయంలో గట్టిగానే సాయిరెడ్డికి క్లాస్ తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ మంటతోనే గంటా శ్రీనివాసరావు మీద విమర్శల జోరు పెంచేసిన విజయసాయిరెడ్డి ఇపుడు ఏకంగా ఆయన ఫ్యామిలీని కూడా లాగి కులబలం కూడా ఆయనకు దక్కకుండా మంత్రాంగం నడుపుతున్నారని అంటున్నారు. మరి చూడాలి దీనికి గంటా శ్రీనివాసరావు నుంచి ఏ విధమైన రిటార్ట్ వస్తుందో.

Tags:    

Similar News