గంటా విషయం అపుడే డిసైడ్ చేస్తారా…?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి రెండు నెలలు పై దాటింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను [more]

Update: 2021-05-16 05:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి రెండు నెలలు పై దాటింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను అని గంటా నాడు గట్టిగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను అని కూడా ఆయన అన్నారు. ఇక గంటా శ్రీనివాసరావు పద్ధతిగానే రాజీనామా చేశారు. అదే విధంగా ఆయన స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని స్వయంగా కలసి తన రాజీనామా ఆమోదించాలని కోరారు. కానీ దాని మీద ఇప్పటిదాకా ఎలాంటి చడీ చప్పుడూ లేదు. మరి ఈ నేపధ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏం చేయబోతున్నారు అన్న దాని మీదనే అందరూ చర్చించుకుంటున్నారు.

మంతనాలేంటో ..?

ఇదిలా ఉంటే తాజాగా విశాఖ వచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను ప్రభుత్వ అతిథి గృహంలో వైసీపీ మంత్రులు వైసీపీకి చెందిన ప్రముఖులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. స్పీకర్ ఎందుకు విశాఖ వచ్చారో తెలియదు కానీ ఆయన్ని కలసిన వారిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. విజయసాయిరెడ్డి స్పీకర్ తమ్మినేనిని మర్యాదపూర్వకంగా కలిసారు అంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ప్రస్తుత రాజకీయాలు చర్చకు వచ్చాయి అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇపుడు విజయసాయిరెడ్డి స్పీకర్ తో భేటీలో ఆ విషయం ఏమైనా కదిపారా, దాని మీద ఏమైనా మాట్లాడుకున్నారా అన్న చర్చ అయితే వైసీపీ నేతలలో వస్తోంది.

స్పీకర్ కోర్టులో బంతి…..

ఇక గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆయన భవిష్యత్తు ఆలోచనలు ఏంటో తెలియదు కానీ రాజీనామా చేస్తే మాత్రం పేరు వస్తుందని ఆలోచనలో ఉన్నారు. అయితే ఆయన రాజీనామాకు స్టీల్ ప్లాంట్ కి ముడి పెట్టి ఉంచారు. కాబట్టి ఇపుడు ఆ విషయం ఎటూ తేలనందున రాజీనామా ఇప్పట్లో ఆమోదిస్తే ఆ ప్రభావం వైసీపీ మీద కూడా పడి వైసీపీ వారు కూడా రాజీనామా చేయాలన్న వత్తిడి ఎక్కువ అవ్తుంది. అందువల్ల తెలివిగానే వైసీపీ ఆలోచనలు చేస్తోంది. ఇక స్పీకర్ కూడా ఈ విషయంలో ఆచీ తూచీ నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు.

సరైన సమయంలో….

మరో వైపు చూస్తే ఇప్పట్లో గంటా శ్రీనివాసరావు రాజీనామా వ్యవహారం ఏంటో తేలినట్లుగా లేదనే చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదో ఒకటి తేలిన వెంటనే గంటా శ్రీనివాసరావు రాజీనామా విషయంలో యాక్షన్ ఉంటుంది అంటున్నారు. ఇక అన్నీ అనుకూలంగా ఉన్నపుడే విశాఖ‌ ఉత్తర నియోజకవర్గంలో ఉప ఎన్నికకు తెర లేపాలని వైసీపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ దగ్గర ఉండడం కూడా ఒక విధంగా వైసీపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ అని అంటున్నారు. గంటా ఏ సంగతీ తేలేంతవరకూ దూకుడు పెంచలేరు. దాంతో యధాతధ స్థితినే కొనసాగిస్తారు అన్న మాట కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News