గంటా వెనక ఢిల్లీ కోటరీ ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు లాబీయింగ్, కోటరీ కోటలను చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఆయన ముందు వ్యాపారవేత్త, [more]

Update: 2020-07-27 05:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు లాబీయింగ్, కోటరీ కోటలను చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఆయన ముందు వ్యాపారవేత్త, ఆ తరువాతే రాజకీయ నాయకుడు. ఇక ఆయన రెండు దశాబ్దాల క్రితం అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ని రికమెండ్ చేసింది, ప్రమోట్ చేసింది అప్పటి టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్నకు ఆర్ధిక అండగా తెరచాటున గంటా శ్రీనివాసరావు అప్పట్లో ఉండేవారని చెబుతారు. గంటాను 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీ టికెట్ ఇప్పించి పోటీ చేయించింది అయ్యన్నపాత్రుడు. ఇక వ్యాపారవేత్తగా ఉన్న గంటాకు అన్ని రాజకీయ పార్టీలతో నాడే మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయ ప్రవేశం తరువాత అవి మరింతగా విస్తరించాయి. ఇపుడు నిజంగా చెప్పాలంటే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ, బీజేపీ సహా అన్ని పార్టీల్లోనూ అత్యంత సన్నిహితులు ఉన్నారు.

ఢిల్లీ పెద్దలు…..

గంటా శ్రీనివాసరావు రాజకీయ అడుగులు ఎటు పడాలన్నా కూడా ఢిల్లీలో ఉన్న కోటరీ సలహాలు సంప్రదింపులు తీసుకుంటే తప్ప ఏదీ జరగదని అంటారు. గంటాకు బలమైన ఆ కోటరీలో మెంబర్ షిప్ ఉంది. వారు తమ ప్రయోజనాలు కూడా చూసుకుని గంటా శ్రీనివాసరావు ద్వారా పావులు కదుపుతారు. ఆ కోటరీకి బీజేపీ పెద్దలతో, కేంద్ర పభుత్వ వర్గాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గంటాని నిజానికి బీజేపీలోకి తీసుకురావాలన్నది ఆ కోటరీ ఆలోచన. దీని మీద చాలా కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి అని ప్రచారంలో ఉంది. గంటా శ్రీనివాసరావుకు రాజ్యసభ టికెట్ ఇప్పించి బీజేపీలో చేర్చుకోవాలన్నది ఒక ప్రతిపాదన. ఆ తరువాత ఆయన మద్దతులో విశాఖ ఉత్తరం సీటుని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు ఇప్పించి గెలిపించుకోవాలని ఆలోచన. ఆ విధంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ ప్రవేశించాలని పధకం.

వదలరా….?

గంటా శ్రీనివాసరావు వంటి బిగ్ షాట్ బీజేపీలోకే రావాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనట. ఏపీవ్యాప్తంగా గంటాకు ఉన్న రాజకీయ బలం, ఆయన సామాజిక వర్గం మద్దతు, ఆర్ధికంగా ఉన్న దన్ను ఇవన్నీ కలిస్తే ఏపీలో బీజేపీ బలపడుతుంది అన్నది ఆలోచనగా చెబుతున్నారు. అయితే గంటాకు రాజ్యసభ కంటే ఏపీ మంత్రి పదవే ఇష్టమని చెబుతారు. పైగా ఆయన మీద వైసీపీ దూకుడుగా వెళ్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన శాఖల్లో అవినీతి కధలను చదివి వినిపించి మరీ లొంగ దీయాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. దాంతో గంటా ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. అయితే గంటా ఏనాడో వైసీపీలోకి వచ్చేసేవారని, బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఢిల్లీ కోటరీయే అడ్డుతోందని అంటున్నారు.

Tags:    

Similar News