గంటా అంత ఈజీగా దొరుకుతారా?

సవాల్ ఎవరైనా చేస్తారు, జవాబు చెప్పినపుడే సత్తా తెలుస్తుంది. అపుడే ఆ సవాల్ పదునెంతో కూడా తేలుతుంది. విషయానికి వస్తే విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా [more]

Update: 2020-07-21 15:30 GMT

సవాల్ ఎవరైనా చేస్తారు, జవాబు చెప్పినపుడే సత్తా తెలుస్తుంది. అపుడే ఆ సవాల్ పదునెంతో కూడా తేలుతుంది. విషయానికి వస్తే విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కి వైసీపీ నుంచి గట్టి ప్రతి సవాల్ ఎదురైంది. ఆయన మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నదే ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చ. గంటా శ్రీనివాస్ తాను అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన మానవవనరుల శాఖలో ఒక చిన్న కుంభకోణాన్ని వైసీపీ ఇపుడు టచ్ చేసింది. ఇది ఒక్కటే కాదు, మరి ఇంకా చాలా ఉన్నాయని అంటోంది. నా మీద యుధ్ధం చేయండి, నా అనుచరులతో కాదు, నాతో పోరాడండి అంటూ ఈ మధ్య గంటా శ్రీనివాస్ వైసీపీ నేతలకు గట్టి సవాలే చేశారు. మరి దీనికి ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంటున్నారు.

ట్రయలేనా…?

నిజానికి గంటా శ్రీనివాస్ అయిదేళ్ళ కాలంలో తాను నిర్వహించిన శాఖలో జరిగిన అవినీతికి జవాబు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో సైకిల్ కుంభకోణం చాలా చిన్నదని, కేవలం 12 కోట్ల కొనుగోళ్ళలో అయిదు కోట్లు మాత్రమే అవినీతి జరిగిందని కూడా అంటున్నారు. దీని మీద వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. పంజాబ్ లోని లుధీయాయాన్లోని ఎస్కే బైక్స్ కంపెనీ నుంచి కాంట్రాక్ట్ తీసుకుని అప్పట్లో ఏపీ సర్కార్ సైకిళ్ళు కొనుగోలు చేసింది. ఈ కంపెనీని గుజరాత్ లో ఒక కొనుగోలు వ్యవహారంలో నాణ్యత లేని సైకిళ్ళు ఇచ్చారని సదరు బాధిత సంస్థ కోర్టుకు వెళ్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మరి అన్నీ తెలిసి కొన్నారా అన్నదే ఇక్కడ పాయింట్. ఇక ఈ స్కాం చాలా చిన్నదని వైసీపీ నేతలే అంటున్నారు.

ఇంకానా…?

ఇంతకు మించి స్కాములు చాలా జరిగాయని, వాటిని తవ్వి తీస్తామని కూడా అంటున్నారు. ఇక గంటా శ్రీనివాస్ మంత్రిగా ఉండగా ఆయన అనుచరులు విశాఖలో భూముల దందా చేశారన్న ఆరోపణలు ఓ వైపు ఉండనే ఉన్నాయి. గంటా శ్రీనివాస్ మీద పరోక్షంగా నాడు ఆయన సహచర మంత్రి అయ్యన్నపాత్రుడే కామెంట్స్ చేశారు కూడా. టీడీపీ ఓడినా ఇపుడు కూడా ఇద్దరూ ప్రత్యర్ధులుగానే ఉంటున్నారు. మరి గంటా శ్రీనివాస్ మీదకు వైసీపీ బాణం దూసుకువెళ్తే అది అయ్యన్న వర్గానికి పరమానందమే. వారే మరిన్ని అధారాలు ఏర్చికూర్చి ఇచ్చినా ఇస్తారని అంటున్నారు. ఇక ఈఎస్ ఐ కుంభకోణాన్ని ఇపుడు గుర్తుకు తెస్తున్నారు. అక్కడ కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఒక కంపెనీ నుంచి ఒప్పందాలు, కొనుగోళ్ళే హైలెట్ గా కేసులు, అరెస్టులు వంటివి జరిగాయి. ఇపుడు ఇది కూడా ఇంతేనా అన్న డౌట్లు వస్తున్నాయి.

నిలబడతారా..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయనకు రాజకీయ చాణక్యుడు అని పేరు. తన చేతికి మట్టి అంటకుండా ఆయన పాలిటిక్స్ చేస్తారని కూడా చెబుతారు. ఇపుడు సైకిళ్ళ స్కాం లో గంటా అంత ఈజీగా దొరుకుతారా అన్న మాట కూడా వినవస్తోంది. అయితే నాడు మంత్రిగా ఆయన బాధ్యత ఎంతో కొంత ఉంటుంది కదా అన్నదే వైసీపీ నేతల వాదన. ఇవన్నీ ఇలా ఉంటే తన మీద రాజకీయ సమరం చేయాలని నేరుగా జగన్ కే సవాల్ చేసిన గంటా నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఎంతవరకూ నిలబడతారు అన్నది కూడా చర్చగా ఉంది. ఇక నిజంగా గంటా శ్రీనివాస్ లాంటివి టార్గెట్ చేస్తారా, లేక వైసీపీ మైండ్ గేమ్ లో ఇది కూడా భాగమా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఇక గంటా శ్రీనివాస్ ఇపుడు బీజేపీలోకి వెళ్దామనుకుంటున్నారని టాక్. ఆయన దారి మళ్ళించుకుంటారా లేక రాజకీయ పోరాటాన్ని టీడీపీ నుంచే కొనసాగిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News