వియ్యంకులకు విషయం లేనట్లేనా?

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయ భ‌విత్య‌మే గంద‌ర‌గోళంగా ఉం ది. ఆయ‌న త‌న సొంత పార్టీ టీడీపీలోకి వ‌చ్చినా.. మంత్రి [more]

Update: 2019-09-09 06:30 GMT

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయ భ‌విత్య‌మే గంద‌ర‌గోళంగా ఉం ది. ఆయ‌న త‌న సొంత పార్టీ టీడీపీలోకి వ‌చ్చినా.. మంత్రి ప‌ద‌వి నిర్వ‌హించినా .. ఇప్పుడు అదే పార్టీలో కొన‌సాగాలా.. తెగ‌దెంపులు చేసుకుని బీజేపీలోకి వెళ్లాలా ? లేక వైసీపీ తీర్థం పుచ్చుకోవాలా ? అనే విష‌యంలో గంటా శ్రీనివాస‌రావు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందుగానే ఆయ‌న పార్టీ మార‌తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దీనిని ఆయ‌న అప్ప‌ట్లో ఘాటుగానే ఖండించారు. త‌న బొందిలో ప్రాణం ఉండ‌గా .. అలాంటిదేమీ జ‌ర‌గ‌బోద‌ని చెప్పారు.

నారాయణ రాజకీయం….

స‌రే.. గంటా శ్రీనివాస‌రావు విష‌యం ఒకింత ప‌క్క‌న పెడితే.. ఈయ‌న‌కు వియ్యంకులు అయిన ఇద్ద‌రు కూడా టీడీపీలో కీల‌కంగా ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ గంటా శ్రీనివాస‌రావుకు స్వ‌యంగా వియ్యం కుడు. అదేవిధంగా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నాయ‌కుడు అంజిబాబు కూడా గంటా శ్రీనివాస‌రావుకు వియ్యంకుడే. మ‌రి ఇప్పుడు వీరి ప‌రిస్థితి ఏంట‌నేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. నారాయ‌ణ విష‌యానికి వ‌స్తే.. ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన ఆయ‌న .. త‌ర్వాత కాలంలో చంద్ర‌బాబుకు ఆప్తుడిగా పేరు తెచ్చుకు న్నారు . రాజ‌ధానికి సంబంధించి కీల‌క ప‌నుల‌న్నీ ఆయ‌నే చూసుకున్నారు. అయితే, పార్టీ త‌ర‌ఫున ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆయ‌న నెల్లూరు సిటీని ఎంచుకున్నారు.

వ్యాపారాలు ఉండటంతో…..

భారీ గానే ప్ర‌చారం చేశారు. ఎన్నిక‌ల‌కు ఐదు నుంచి ఆరు నెల‌ల ముందుగానే నారాయ‌ణ నెల్లూరు సిటీపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అయితే, ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ ముందు మంత్రి నారాయ‌ణ చ‌తికిల ప‌డ్డారు. దీనికి పార్టీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు కూడా కార‌ణ‌మ‌నే భావ‌న‌తో ఆయ‌న ప్ర‌స్తుతం మౌనంగా ఉన్నారు. త‌న‌కున్న వ్యాపారాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి వ్య‌తిరేక‌త కొని తెచ్చుకోవ‌డం ఎందుకు ? ఐదేళ్ల త‌ర్వాత ప‌రిస్థితిని బ‌ట్టి అప్పుడు టీడీపీని మోయొచ్చులేన‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక‌, గంటా శ్రీనివాస‌రావు మ‌రో వియ్యంకుడు అంజిబాబు.

రాజకీయాల నుంచే తప్పుకుందామని….

గ‌తంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ఈయ‌న తాజా ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. గ‌తంలో రెండు సార్లు వ‌రుస‌గా గెలిచిన అంజిబాబు తాజా ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ ఆశించి ఓట‌మి పాల‌య్యారు. అయితే, ఇక్క‌డ నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా పోటీ చేయ‌డంతో ఓట్ల చీలిక వ‌చ్చి అంజిబాబు మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఆయ‌న రాజ‌కీయాల‌పై ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపు ఇచ్చినా.. ఏ కార్యక్ర‌మానికి కూడా ఆయ‌న ఉత్సాహం చూపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గంటా శ్రీనివాస‌రావు వియ్యంకుల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ? చూడాలి

Tags:    

Similar News