అందుకే గంటా మాస్టర్ స్ట్రోక్ మూవ్ చేశారా?

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కానున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. గంటా 2019 [more]

Update: 2021-03-01 08:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కానున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. గంటా 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా అతి కష్టం మీద నెగ్గారు. కేవలం మూడు వేల ఓట్ల తేడాతోనే ఆయన గెలిచారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ఓటమి పాలు కావడంతో గంటా శ్రీనివాసరావు ఇరకాటంలో పడ్డారు. ఆ తరువాత ఆయన వైసీపీలోకి చేరడానికి విశ్వప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టడంతో ఆలోచనలో పడ్డారని అంటున్నారు.

అదను చూసి అలా…..

ఇక తెలుగుదేశం ఓడాక చంద్రబాబుతో పెద్దగా రిలేషన్స్ మెయింటెయిన్ చేయని గంటా శ్రీనివాసరావు తాను వైసీపీకి చేరడం ఖాయమని అనుకున్నారు. తొలిసారిగా గంటా మాస్టర్ ప్లాన్ రివర్స్ అయింది. ఇటు చంద్రబాబుకు కూడా ఆయన చెడ్డ అయ్యారు. పార్టీ పదవులు కూడా దక్కకుండా పోయాయి. దీంతో గంటా ఎందుకొచ్చిన ఎమ్మెల్యే పదవి అంటూ ఒక దశలో వైరాగ్యం చెందారు. విశాఖ రాజధాని కోసమే రాజీనామా చేద్దామని మొదట అనుకున్నా ఆ సమస్య న్యాయ సమీక్ష ముందుకు వెళ్లడంతో ఆగిపోయారు. ఇపుడు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తెర ముందుకు రావడంతో ఇదే గొప్ప అవకాశమని, పైగా త్యాగం చేశానని చెప్పుకోవడానికి బాగా ఉంటుందని తలచే గంటా శ్రీనివాసరావు మాస్టర్ స్ట్రోక్ మువ్ చేశారు అంటున్నారు.

తలాఖ్ అనేశారా …?

ఇక గంటా శ్రీనివాసరావు మళ్లీ ఉత్తరం సీటు వైపు కన్నెత్తి చూడరని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్తరంలో గంటా ఎమ్మెల్యేగా పెద్దగా పట్టు సాధించలేకపోయారు. పైగా అక్కడ టీడీపీ వీక్ గా ఉంది. వైసీపీ బలం సాధించింది. ఇక గంటా పొలిటికల్ కెరీర్ లో అతి తక్కువ మెజారిటీ అక్కడే వచ్చింది. దాంతో ఆ సీటుని వదిలేసుకుందామనే భావనతోనే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్నారని టాక్. దీంతో ఈ పరిణామం వైసీపీకి పూర్తిగా కలసివచ్చిందని అంటున్నారు. ఇప్పటికే అనధికార ఎమ్మెల్యేగా ఉన్న కేకే రాజు తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ ఉత్తరం బాధ్యత‌లను చూసుకుంటున్నారు. గంటా రాజీనామాతో వైసీపీ అక్కడ హడావుడి కూడా ఎక్కువగా చేస్తోంది. ఎన్నికలు త్వరలో వస్తాయని వైసీపీ జెండా ఎగరేయాలనే ఆ పార్టీ ఆలోచనగా ఉందిట.

ఉప ఎన్నిక ఖాయం…..

గంటా శ్రీనివాసరావు రాజీనామాను కరెక్ట్ గానే స్పీకర్ ఫార్మెట్ లో పంపించారు. పైగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఫోన్ లో గంటాతో రాజీనామా విషయం చర్చించారు. స్టీల్ ప్లాంట్ వివాదం కనుక ఒక కొలిక్కి వస్తే సరైన టైమ్ చూసుకుని గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ఆలోచిస్తున్నారుట. అదే జరిగితే అక్కడ నుంచి పోటీ చేసి గెలిచేందుకు వైసీపీ రెడీగా ఉంది. మొత్తానికి గంటా ఈ టెర్మ్ మాజీ ఎమ్మెల్యేగానే ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి టీడీపీలో కొనసాగడమా వేరే పార్టీలో చేరడమా అన్నది నిర్ణయించుకుంటారట.

Tags:    

Similar News