ఆ టీడీపీ ఎమ్మెల్యే సెట్ అయినట్లేనా?

అదేంటో తెలియదు కానీ చంద్రబాబు జమానాలో పార్టీలో ఎక్కువగా తమ్ముళ్ళ తిరుగుబాట్లు ఉండవు. ఒకరిద్దరు అటూ ఇటూ జారడం షరా మామూలు రాజకీయ వ్యవహరం అయినా మెజారిటీ [more]

Update: 2020-12-13 13:30 GMT

అదేంటో తెలియదు కానీ చంద్రబాబు జమానాలో పార్టీలో ఎక్కువగా తమ్ముళ్ళ తిరుగుబాట్లు ఉండవు. ఒకరిద్దరు అటూ ఇటూ జారడం షరా మామూలు రాజకీయ వ్యవహరం అయినా మెజారిటీ పార్టీ మాత్రం ఇంత దైన్య స్థితిలో కూడా కదలకుండా కట్టుదిట్టంగా చంద్రబాబు వెనకాలే ఉందీ అంటే అది బాబు రాజకీయ మంత్రదండం గొప్పతనమే అని అంటారు. నిజానికి 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలను 44కి తెచ్చేసిన న ఘనత చంద్రబాబుది. అది కూడా కేవలం ఒకే ఒక్క ఏడాదిలో. మరి 23 మందికి దిగజారీ అయోమయంలో ఉన్న టీడీపీ నుంచి నలుగురు మాత్రమే వైసీపీ వైపు చూశారూ అంటే అది కచ్చితంగా చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తప్ప మరోటి కాదేమో.

గూటికి చేరారా …?

విశాఖ జిల్లాలో చూస్తే కొన్ని నెలల క్రితం వరకూ పార్టీ తరఫున వాయిస్ పెద్దగా వినిపించలేదు. గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్, సౌత్ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ అయితే చాలా కామ్ గా తాడేపల్లి వెళ్ళి జగన్ సమక్షంలో తన ఇద్దరి కొడుకులనూ చేర్పించారు. తాను మద్దతు ప్రకటించి వచ్చేశారు. ఇక అదే బాటలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడా రూట్ మారుస్తున్నారు అని ప్రచారం గట్టిగా సాగింది. దానికి టైం, డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ గణబాబు కొన్నాళ్ళు మాత్రమే సైలెంట్ అయ్యారు. ఇపుడు ఒక్కసారిగా మళ్ళీ పూర్వపు చురుకుదనం చూపిస్తున్నారు.

బాబు వైపేనట ….

తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అయితే పెంచిన మునిసిపల్ పన్నుల మీద గణబాబు గట్టిగానే గొంతు చేసుకున్నారు. ఇక ఆ తరువాత విశాఖలో మీడియా మీటింగ్ పెట్టి మరీ జగన్ సర్కార్ మీద నిప్పులు చిరిగారు. జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరికలూ పంపారు. మరో వైపు తన నియోజకవర్గంలో పార్టీవాదులతో కలసి కార్యక్రమాలు నిర్హిస్తున్నారు. ఇంతలో ఎంత మార్పు అని తమ్ముళ్ళు అనుకుంటుండగానే గణబాబు సీరియస్ గానే చంద్రబాబు అజెండాను జనంలోకి తీసుకెళ్తున్నారు.

సౌండ్ చేస్తారా..?

విశాఖలో టీడీపీకి ఉన్న నలుగురిలో ఇప్పటిదాక ఒకే ఒక్కడుగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నిలిచారు. ఇపుడు గణబాబు జత కలవడంతో టీడీపీ సౌండ్ పెరిగింది. మరో వైపు గంటా సైలెంట్ గానే ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు ఇచ్చినా టీడీపీని ఇటీవల కాలంలో విమర్శించడం మానేశారు. ఈ పరిణామాలు చూసుకుంటే రెండేళ్ళకు దగ్గర పడుతున్న వైసీపీకి ప్రజా వ్యతిరేకత కూడా బాగానే వస్తోందని, ఇపుడు టీడీపీలో ఉండడం బెటర్ అని తమ్ముళ్ళు అనుకుంటున్నట్లుగా భావించాలేమో. మొత్తానికి గణబాబు సెట్ అయినట్లే కనిపిస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News