టీడీపీ త్రిమూర్తులు ఏం చేస్తున్నారు..

రాష్ట్రంలో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ముగ్గురే ముగ్గురు. మొత్తం 25 స్థానాల‌కు గాను 22 చోట్ల వైసీపీ జ‌య‌కేత‌నం ఎగుర వేయ‌గా.. గుంటూరు, [more]

Update: 2019-09-10 03:30 GMT

రాష్ట్రంలో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ముగ్గురే ముగ్గురు. మొత్తం 25 స్థానాల‌కు గాను 22 చోట్ల వైసీపీ జ‌య‌కేత‌నం ఎగుర వేయ‌గా.. గుంటూరు, విజ‌య‌వాడ‌, శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. అయితే, ఈ ముగ్గురు త్రిమూర్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. వారు ఎంపీగా ఎన్నికై 100 రోజులు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో వారు చేస్తున్న అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఏంటి ? ప్రజలకు చేరువ‌గా ఉంటున్నారా ? ప్రజా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారా ? లేదా ? అనే అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. గుంటూరు ఎంపీగా రెండో సారి విజ‌యం సాధించారు గ‌ల్లా జ‌య‌దేవ్‌.

గ‌త టెర్మ్‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మిస్ట‌ర్ పీఎం అంటూ ఆయ‌న పార్ల‌మెంటులో సంచ‌ల‌న ప్ర‌సంగం చేశారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ఆయ‌న గుర్తింపు పొందారు. ఈ ఊపుతోనే ఆయ‌న రెండో సారి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఇప్పుడు వంద రోజులు పూర్తి చేసుకున్నా ఆశించిన మేర‌కు ఆయ‌న పురోగ‌తి సాధించ‌లేదనేది వాస్త‌వం. ఆయ‌న ముందు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణాన‌ది చెంత‌నే ఉన్నా, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు గుక్కెడు తాగునీరు కావాల‌న్నా ఇబ్బందులు ఉన్నాయి.ఇక‌, అమ‌రావ‌తి, గుంటూరు ప్ర‌త్యేక రైలు ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌లు ముందుకు సాగ‌డం లేదు. న‌డికుడి-తిరుప‌తి లైను ప్ర‌తిపాద‌న ఓకే అయినా ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి.

ఆయా విష‌యాల్లో ఆయ‌న దూసూకుపోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గెలిచిన‌ప్పుడు ఐదేళ్ల పాటే నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌య‌దేవ్ ఇప్పుడుప్ర‌తిప‌క్షంలో ఉన్నా వ్యాపారాలు చూసుకుంటూ గుంటూరు వైపు క‌న్నెత్తి చూడ‌డం లేద‌న్న‌దే అక్క‌డ జ‌నాల టాక్. వ‌రుస‌గా రెండుసార్లు గెలిపించిన ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌న పెట్టి సొంత వ్యాపారాలు, వ్య‌వ‌హారాల‌తోనే త‌ల‌మున‌క‌ల‌వుతుండ‌డంతో విమ‌ర్శ‌లు ముసురుకున్నాయి. ఇక‌, పార్టీలోనూ పెద్ద‌గా గ‌ళం వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, శ్రీకాకుళం నుంచి వ‌రుస‌గా రెండో సారి కూడా విజ‌యం సాధించిన కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు మీడియాలో త‌ర‌చుగా క‌నిపిస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున‌, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పైనా దృష్టి పెడుతున్నారు. యువ‌త‌ను సంఘ‌టితం చేయ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కేంద్రం నుంచి జిల్లాకు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విష‌యంలో గ‌ళం విప్పుతున్నారు.

టీడీపీ అధికారంలో లేక‌పోయినా.. పార్టీకి అవ‌స‌ర‌మైన అన్ని విధాలా సాయం అందిస్తున్నారు. భ‌విష్య‌త్తులో పార్టీ పుంజుకోవాలంటే రామ్మోహ‌న్‌నాయుడుకు ఏపీ టీడీపీ ప‌గ్గాలు ఇవ్వాల‌న్న చ‌ర్చ‌లు కూడా ఎక్కువుగా న‌డుస్తున్నాయి. ఇక‌, విజయవాడ ఎంపీ కేశినేని వివాదాల‌కు కేంద్రంగా మారిన విష‌యం తెలిసిందే. త‌న‌కు పార్టీ త‌ర‌ఫున ప‌ద‌వులు ద‌క్క‌లేదనే అసంతృప్తితో ఆయ‌న కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కుల‌పైనే ఆయ‌న విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. అటు చంద్ర‌బాబుతో పాటు సొంత పార్టీ నేత‌ల‌పై ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అభివృద్ధి విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా.. కీల‌క‌మైన గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునే ప‌ని మాత్రం చేస్తున్నారు. అయితే, పార్టీ మార‌తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నా.. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తంగా ముగ్గురు టీడీపీ ఎంపీల్లో ఒక్క రామ్మోహ‌న్ నాయుడికి మాత్ర‌మే మంచి మార్కులు ప‌డుతున్నాయి

Tags:    

Similar News