Galla : గల్లా కుటుంబం చివరకు అలా డిసైడ్ చేసిందా?

గల్లా కుటుంబం మౌనంగా ఉండటానికి కారణాలేంటి? టీడీపీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లిందా? లేక సమయం చూసి యాక్టివ్ కావాలనా? మొత్తం మీద గల్లా కుటుంబం గత ఆరు [more]

Update: 2021-10-30 00:30 GMT

గల్లా కుటుంబం మౌనంగా ఉండటానికి కారణాలేంటి? టీడీపీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లిందా? లేక సమయం చూసి యాక్టివ్ కావాలనా? మొత్తం మీద గల్లా కుటుంబం గత ఆరు నెలలుగా రాజకీయంగా సైలెంట్ గా ఉంది. టీడీపీలో నేతలందరూ యాక్టివ్ అవుతున్న సమయంలో ఈ కుటుంబం మాత్రం పార్టీకి దూరంగా జరగడానికి కారణాలపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణాలపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది.

రెండు సార్లు గెలిచి….

గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగారు. అయితే గల్లా జయదేవ్ ఎప్పుడూ సీరియస్ రాజకీయాలు చేయరన్న పేరుంది. ఆయన వ్యాపారాలకే ఎక్కువ పరిమితం అవుతారు. అందుకే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి సొంత పార్టీ నేతలే ఆయన అందుబాటులో ఉండరన్న ఫిర్యాదు పలుమార్లు చేశారు.

ఎక్కడా కన్పించకుండా…

కానీ కేవలం ముగ్గురు ఎంపీలే గెలవడంతో చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ ను ఏమీ అనలేకపోతున్నారు. ఆయన విదేశీ పర్యటనలకు తరచూ వెళుతుంటారు. ఆయన కుమారుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు పెద్దగా టైం కేటాయించడం లేదు. ఇటీవల చంద్రబాబు చేసిన 36 గంటల దీక్షలోనూ, ఆ తర్వాత జరిగిన ఢిల్లీ పర్యటనకు కూడా గల్లా జయదేవ్ దూరంగా ఉండటం కొంత చర్చనీయాంశమైంది.

అరుణ కుమారి కూడా….

అయితే గల్లా జయదేవ్ నిజంగ బిజీగా ఉంటే ఆయన తరుపున తల్లి గల్లా అరుణకుమారి ఖచ్చితంగా చంద్రబాబు దీక్షకు వచ్చే వారు. గల్లా అరుణ కుమారి సయితం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వచ్చినా గల్లా అరుణ కుమారి కలిసే ప్రయత్నం చేయలేదు. ఈసారి గల్లా జయదేవ్ అసలు పోటీ చేస్తారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే కన్పిస్తుందంటున్నారు. వ్యాపారాల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా గల్లా జయదేవ్ భావిస్తున్నారన్న టాక్ వినపడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News