ఆ ఇద్దరితోనూ ఈయనకు పడదట.. ఇక కష్టమే

క‌డ‌ప వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయా ? ఇక్కడ ఇప్పటి వ‌ర‌కు పార్టీకి అనుకూలంగా ఉన్న ఇద్దరు కీల‌క నేత‌ల మ‌ధ్య పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయా ? ఇద్దరు [more]

Update: 2020-12-15 13:30 GMT

క‌డ‌ప వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయా ? ఇక్కడ ఇప్పటి వ‌ర‌కు పార్టీకి అనుకూలంగా ఉన్న ఇద్దరు కీల‌క నేత‌ల మ‌ధ్య పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయా ? ఇద్దరు నేత‌లు ఒక‌రిపై ఒక‌రు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు క‌డ‌ప జిల్లా వైసీపీ నాయ‌కులు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో ఈ ఇద్దరు నేత‌ల ఫిర్యాదుల‌తో క‌డ‌ప రాజ‌కీయం వేడెక్కిన‌ట్టే తెలుస్తోంది. ఇంత‌కు ఇక్కడ రాజ‌కీయం వేడెక్కించిన ఆ ఇద్దరు నేత‌లు ఎవ‌రో కాదు క‌‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి. ఇటీవ‌ల కాలంలో క‌డ‌ప జిల్లాలో టీడీపీ దూకుడు పెంచుతోంది. జ‌గ‌న్ సైతం జిల్లాలో టీడీపీకి చిన్న స్పేస్ కూడా ఇవ్వకూడ‌ద‌ని ఎంపీ అవినాష్‌రెడ్డికి ప్రత్యేకంగా సూచించ‌డంతో ఆయ‌న జిల్లా వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్యట‌న‌లు చేస్తున్నారు.

సమాచారం లేకుండా…..

ముఖ్యంగా ఇటీవ‌ల వ‌చ్చిన అకాల వ‌ర్షాల‌కు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప‌ర్యటించి రైతుల‌ను ఓదారుస్తున్నారు. స‌హ‌జంగా ఏ ప్రజాప్రతినిధి అయినా.. ఇది చేసేదే. అయితే.. ఈ క్రమంలో త‌న‌కు స‌మాచారం లేద‌ని.. త‌న‌కు చెప్పకుండా ఎంపీ ఇలా ప‌ర్యట‌న‌లు చేయ‌డ‌మేంట‌ని చీఫ్ విప్‌గా ఉన్న గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు సంధించారు. ఈ వ్యాఖ్యలు జిల్లా రాజ‌కీయాల్లో ప్రాధాన్యత సంత‌రించుకున్నాయి. ఈ వ్యాఖ్యల‌పై ఎంపీ స్పందిస్తూ త‌న‌కు సీఎం ప‌ర్మిష‌న్ ఉంద‌ని.. తాను జిల్లా ఎంపీన‌ని.. త‌న‌కు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంద‌ని ప్రశ్నించారు. ఇది చిలికి చిలికి ఆధిప‌త్య పోరుకు దారితీసింది.

మిధున్ రెడ్డితోనూ….

వాస్తవానికి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం రాయ‌చోటి క‌డ‌ప జిల్లాలో ఉన్నా అది రాజంపేట పార్లమెంటు ప‌రిధిలో ఉంది. అయినా అవినాష్ రెడ్డి జిల్లా అంత‌టా ప‌ర్యటించ‌డంతో రాయ‌చోటికి కూడా వెళ్లారు. ఇక రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మ‌ద్దతు కూడా అవినాష్‌రెడ్డికే ఉంద‌ట‌. దీనిని బ‌ట్టి శ్రీకాంత్‌రెడ్డికి మిథున్‌రెడ్డితోనూ ఎక్కడో గ్యాప్ వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో విసుగుచెందిన గ‌డికోట‌.. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకువె ళ్లారని స‌మాచారం. అయితే.. జ‌గ‌న్ ఈ విష‌యాన్ని విని కూడాప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం.

పరామర్శలోనూ…..

కానీ, స్థానికంగా క‌లిసి మెలిసి ఉన్న నాయ‌కులు ఇప్పుడు తుఫాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించే విష‌యంలో రాజ‌కీయం చేసుకోవ‌డం స‌ర్వత్రా విస్మయానికి గురి చేస్తోంద‌ని.. ఇది రాజ‌కీయ వైరుద్ధ్యంగా మారితే మున్ముందు పార్టీకి ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం ఈ టాపిక్ వైసీపీ వ‌ర్గాల్లో ముఖ్యంగా క‌డ‌ప‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప‌రిణామాల‌న్ని ఎంతో స‌న్నిహితులు అయిన జ‌గ‌న్‌కు, గ‌డికోట శ్రీకాంత్ రెడ్డికి మ‌ధ్య గ్యాప్ పెరిగిందా ? అన్న సందేహాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా ఉన్నాయ‌నే చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

Tags:    

Similar News