అల‌క‌పాన్పుపై.. టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే.. బాబుకు దూరం దూరం

ఆయ‌న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న వివాద ర‌హిత నాయ‌కుడు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత [more]

Update: 2020-05-23 03:30 GMT

ఆయ‌న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న వివాద ర‌హిత నాయ‌కుడు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత సామాజికవ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీలో అతిర‌థ మ‌హార‌థులు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. ఈయ‌న మాత్రం విజ‌యం సాధించారు. ఆయ‌నే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ‌న్. వ‌రుస‌గా ఆయ‌న ఇక్కడ విజ‌యం సాధిస్తూనే ఉన్నారు. ఇక‌, ఆయ‌న స‌తీమ‌ణి అనురాధ కూడా రాజ‌కీయాల్లోనే ఉన్నారు. కృష్ణాజిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్సన్‌గా చేశారు.

యాక్టివ్ గా లేక…

త‌మ సొంత సామాజిక వ‌ర్గంలో కూడా గ‌ద్దె రామ్మోహ‌న్ కు మంచి ప‌ట్టుంది. అదే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజయానికి కార‌ణ‌మైంద‌నే వాద‌న ఉంది. ఇక ఆయ‌న వ్యక్తిగ‌త ఇమేజ్ కూడా ఆయ‌న‌కు ప్లస్ అయ్యింది. విజ‌య‌వాడ నుంచి టీడీపీ త‌రఫున పోటీ చేసిన గెలిచిన‌వారిలో గ‌ద్దె రామ్మోహ‌న్ ఒక్కరే. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ కూడా ఇప్పటికే వైసీపీకి చేరువ‌య్యారు. ఇక ఇప్పుడు జిల్లా పేరు చెపితే ఒక్క గ‌ద్దె రామ్మోహ‌న్ మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఆయ‌న ఇటీవ‌ల కాలంలో చంద్రబాబుతో తీవ్రంగా విభేదిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే ఆయ‌న పార్టీలో యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని అంటున్నారు.

జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో…

జ‌గ‌న్ ప్రభుత్వంపై ఇదే న‌గ‌రంలో సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓడిపోయిన బొండా ఉమా రెచ్చిపోతున్నారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, గెలిచిన ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. బాబు ఇస్తున్న సూచ‌న‌ల‌ను కూడా గ‌ద్దె ప‌ట్టించుకోవడం లేద‌ని అంటున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అని ఆరాతీస్తే.. విశ్లేష‌కుల అంచ‌నా ప్రకారం.. త‌న క‌న్నా జూనియ‌ర్లకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, త‌న సతీమ‌ణికి వ‌స్తుంద‌ని భావించిన విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠం.. స్తానిక ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత‌కు కేటాయించ‌డంపై గ‌ద్దె దంప ‌తులు అల‌క వ‌హించార‌నే ప్రచారం జ‌రుగుతోంది.

సైలెన్స్ అందుకేనా?

అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కూడా పార్టీని నిల‌బెట్టేందుకు ఎంతో కృషి చేశామ‌ని, కానీ, చంద్రబాబు మాత్రం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌మ‌కు ఏమా త్రం కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేద‌ని అందుకే గ‌ద్దె రామ్మోహ‌న్ దంప‌తులు బాబు దూరంగా ఉంటున్నార‌ని చెబుతున్నారు. గ‌న్నవ‌రంలో వంశీ పార్టీ మారాక గ‌ద్దె అనూరాధ‌కు అక్కడ ప‌గ్గాలు ఇవ్వాల‌ని చూశారు. అయితే గ‌ద్దె దంప‌తులు మాత్రం త‌మ‌కు మేయ‌ర్ పీఠం కావాల‌ని ప‌ట్టుబ‌ట్టడంతో పాటు అనూరాధ ఓటును కూడా రూర‌ల్ నుంచి న‌గ‌రంలోకి మార్పించుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం కేశినేని కుమార్తె శ్వేత‌కే న‌గ‌ర మేయ‌ర్ పీఠంపై హామీ ఇచ్చార‌న్న న్యూస్ దాదాపు ఖ‌రారైంద‌ని టీడీపీ వాళ్లు చెపుతున్నారు. అప్పటి నుంచి గ‌ద్దె రామ్మోహ‌న్ సైలెంట్ అయిపోయారు. అయితే, పార్టీ నుంచి దూరంగా వెళ్లే ఆలోచ‌న ఏదీ లేద‌ని చెబుతున్నారు. అయితే, కొంత డిస్టెన్స్ మాత్రం మెయింటెన్ చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఎప్పటికి వీరికి బాబుకు మ‌ధ్య లైన్ క్లియ‌ర్ అవుతుందో ? చూడాలి.

Tags:    

Similar News