నేపాల్ ఎగిరెగెరి పడుతుంది అందుకేనా?

నిన్న మెున్నటిదాకా మిత్రదేశమైన నేపాల్ నిప్పులు కక్కుతోంది. చైనా దన్ను చుాసి చెలరేగిపోతోంది. భారత్ ను చొరబాటుదారుగా, ఆక్రమణదారుగా చుాపించేందుకు పడరాని పాట్లు పడుతోంది. భారత్ ఆధానంలోని [more]

Update: 2020-06-22 16:30 GMT

నిన్న మెున్నటిదాకా మిత్రదేశమైన నేపాల్ నిప్పులు కక్కుతోంది. చైనా దన్ను చుాసి చెలరేగిపోతోంది. భారత్ ను చొరబాటుదారుగా, ఆక్రమణదారుగా చుాపించేందుకు పడరాని పాట్లు పడుతోంది. భారత్ ఆధానంలోని తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాడతామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తోంది. ఏకంగా ఈ మేరకు నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేయడం విశేషం. భారత్ సరిహద్దుల్లోని లిపూల్ ఖ్, కాలాపానీ, లింపియాధురాలు తమకేనంటుా ఇటీవల హిమాలయ పర్వతరాజ్యం వివాదాస్పద ప్రకటన చేసింది. ఇవి తమ దేశంలో భాగమంటుా కొత్తగా మ్యాప్ ను తయారుచేసి దానికి పార్లమెంట్ ఆమెాదం పొందడం తాజా పరిణామం. అంతేకాక, బీహార్ సరిహద్దుల్లో కాల్పులకు దిగి ఒక భారతీయుడిని కాల్చిచంపడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇటీవల వరకూ సంప్రదాయంగా…

నేపాల్ లో ఖడ్ల ప్రసాద్ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ అధికారంలోకి వచ్చాక పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. సహజంగా వామపక్ష ప్రభుత్వం కావండంతో చైనా ప్రభావాంలోకి అది జారిపోయింది. చైనా కుాడా భారత్ వ్యతిరేకతతో నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకుంది. తాయిలాల ఆశ చూపి నేపాల్ లో భారత్ వ్యతిరేకతను ప్రోత్సహించింది. తాజా పరిస్ధితి ఇది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే నేపాల్ కు భారత్ ఎంత సన్నిహితమెా అర్ధమవుతుంది. అప్పట్లో అధికారం చేపట్టిన ప్రతి నేపాల్ ప్రధాని తొలుత భారత్ లో పర్యటించేవారు. ఆ తరువాతే ఇతరదేశాల పర్యటనకు వెళ్ళేవారు. ఈ సంప్రదాయం ఇటీవల వరకు కొనసాగింది.

ఈయన హయాంలోనే…..

ఖడ్ల ప్రసాద్ శర్మ ఓలీ హయాంలోనే దీనికి బ్రేక్ పడింది. సుదీర్ఘకాలం రాచరికంలో మగ్గిన నేపాల్ లో ప్రజాస్వామ్య స్ధాపనకు భారత్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. రాచరికానికి వ్యతిరేకంగా అజ్ఞాతంలో ఉండి పోరాడిన ప్రచండ అలియాస్ పుష్పకమాల్ దహల్ ను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చింది భారత్ కావడం గమనార్హం. ప్రచండ, నాటి నేపాల్ రాజు మధ్య చర్చలకు 2006 లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం విశేష కృషి చేసింది. ఇరువర్గాల మధ్య చర్చలకోసం సీపీఎం అధినేత, నేటి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచుారిని ప్రత్యేకంగా పంపించి ఎట్టకేలకు 2008 లో రాచరికాన్ని రద్దుచేసి గణతంత్ర రిపబ్లిక్ గా నేపాల్ ఆవిర్భావానికి తెరవెనుక భారత్ చేసిన కృషి అంతర్జాతీయ సమాజానికి సుపరిచితం. వాస్తవానికి ప్రచండ హయాంలోనే ఇరు దేశాల మధ్య విభేదాలకు బీజం పడింది. వామపక్షవాది అయిన ప్రచండ సహజంగానే చైనావైపు మెుగ్గు చుాపారు. ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ అధికారంలోకి వచ్చాక చైనాకు మరింత చేరువ అయ్యారు. అప్పటినుంచి పరిస్ధితి దిగజారింది.

సరిహద్దు ప్రాంతంలో….

భారత్ – నేపాల్ మధ్య రమారమి 1751 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారత్ లోని బీహార్, యుాపీ, పశ్చిమ బెంగాల్ ఈ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ముఖ్యంగా బీహార్ సరిహద్దు కీలకమైనది. తాజాగా ఈ రాష్ట్రంలోని సీతామడి జిల్లా జానకీ నగర్ సమీపంలో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో వికేశ్ యాచల్ (22) అనే బీహారీ యువకుడు మరణించారు. దశాబ్ధాల క్రితం బీహార్, యుపీ వాసులు నేపాల్ వలస వెళ్ళి వ్యవసాయం చేసుకుంటుా అక్కడ స్ధిరపడ్డారు. వీరిని నేపాల్ లో మధేశీలు అని పిలుస్తారు. వీరికోసం ఓ ప్రాంతీయ పార్టీ కుాడా ఉంది. అనేక మంది నేపాలీలు, బీహార్, యుపీ వాసుల మధ్య బంధుత్వాలు, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వివాహాలు చేసుకోవడం కూడా ఉంది. ఉభయ దేశాల ప్రజలు ఎలాంటి పాస్ పోర్ట్, వీసా ఆంక్షలు లేకుండా రెండు దేశాల్లో పర్వటించేందుకు అవకాశం ఉంది. ఉభయదేశాల సరిహద్దులు మధ్య ఎలాంటి ఫెన్సింగ్ కుాడా లేదు. కేవలం పోలీసు చెక్ పోస్టులే ఉంటాయి. ఆధార్ కార్డు చుాపించి వెళ్ళవచ్చు. భారతీయ కరెన్సీ చెల్లుబాటు అవుతుంది. భారత్ లో అనేక మంది నేపాలీలు జీవనోపాధి పొందుతున్నారు. భారత్ సైన్యంలో ప్రత్యేకంగా గుార్ఖా రెజిమెంట్ ఉంది. ఎంతోమంది నేపాలీలు భారత్ లో రాత్రవేళల్లో ‘ గస్తీ ‘ తిరుగుతుంటారు. వీరిని ‘ గుార్ఖాలు ‘ అని పిలుస్తారు.

ఒప్పందం ప్రకారం…

1816 నాటి సుగౌలి ఒప్పందం ద్వారా కాలాపానీ, లిపూలెఖ, లింపుయాధారాలు తమ పరిధిలోకి వచ్చాయని అయితే 1962 నుంచి భారత్ వీటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుందని నేపాల్ ఆరోపిస్తోంది. భారత్ విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ వాదనను ఖండిస్తున్నారు. నేపాల్ పేర్కొన్న ముాడు ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాంష్ట్రంలోని పితార్ ఘడ్ ప్రాంతంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను హిమాలయ పర్వత రాజ్యం వివాస్పదం చేయడం వెనుక చైనా కుట్ర ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News