అచ్చెన్న అరెస్ట్ అందుకేనా? ఆ స్కామ్ అంత జరిగిందా?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈఎస్ఐ స్కాంలో ఆయనను శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారు జామున 6గంటలకు అచ్చెన్నాయుడును అదుపులోకి [more]

Update: 2020-06-12 03:30 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈఎస్ఐ స్కాంలో ఆయనను శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారు జామున 6గంటలకు అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య అచ్చెన్నాయుడును టెక్కలి నుంచి విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ స్కామ్ గత ఆరు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం వెలుగు చూడటంతో ఏపీలో కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ ప్రారంభించింది.

విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్….

కొన్నాళ్ల క్రితం ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను బట్టబయలు చేసింది. తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినట్టు విజిలెన్స్ శాఖ బట్టబయలు చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను బయటపెట్టింది. అయితే ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను బయటపెట్టింది.

నేరుగా లేఖలు రాసి…..

టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిలో కాంటాక్ట్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఈఎస్ఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న ఈఎస్ఐ డైరెక్టర్ టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిన మెడిసిన్స్ అఫ్లై కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి లేఖ తో పాటుగా నివేదిక కూడా బట్టబయలు అయింది. దీనిలో ప్రధానంగా కోట్ల రూపాయల స్కాం జరిగినట్టుగా విజిలెన్స్ బయటపెట్టింది. రేట్ కాంటాక్ట్ లో లేని కంపెనీలకు పెద్ద ఎత్తున ఈఎస్ఐ డైరెక్టర్ కాంటాక్ట్ కట్టబెట్టారని తేల్చింది.

150 కోట్ల కుంభకోణం….

మందులు, పరికరాల కొనుగోళ్లలో దాదాపు 150 కోట్ల కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మంత్రిగా అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారని, కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అని అధికారులు చెబుుతన్నారు. మొత్తం 988 కోట్ల మందులను ఈఎస్ఐ ఆసుపత్రులకు మందులు కొనుగోలు చేశారు. మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు చెబుతున్నారు. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ మంత్రి కుమారుడి ప్రాత ఉందని కూడా విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.

Tags:    

Similar News