కనికరం లేకుండా వాతలు పెట్టేస్తున్నారే?

ఎలాంటి పరిస్థితుల్లో క్షమించడం అన్నది తమ డిక్షనరీ లో లేనట్లు వ్యవహరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక పక్క కరోనా మహమ్మారి దెబ్బకు మూడు నెలలుగా ఆదాయం [more]

Update: 2020-06-24 11:00 GMT

ఎలాంటి పరిస్థితుల్లో క్షమించడం అన్నది తమ డిక్షనరీ లో లేనట్లు వ్యవహరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక పక్క కరోనా మహమ్మారి దెబ్బకు మూడు నెలలుగా ఆదాయం లేక దేశంలోని సామాన్యులు అల్లాడిపోతూ ఉంటె మాకు ఇవన్నీ అనవసరం అన్న రీతిలో సర్కార్ వ్యవహారం సాగుతుంది. ఫలితంగా లాక్ డౌన్ ఆంక్షలు చాలావరకు సడలిన నేపథ్యంలో గత రెండు వారాలుగా పెట్రోల్ డీజీల్ ధరలను రోజు పెంచుతూ వినియోగదారుడి జేబుకి చిల్లుపెడుతుంది. లాక్ డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు బంద్ కావడంతో పెట్రో ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఢమాల్ మన్నాయి.

నొప్పి తెలియకుండా…?

ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఆయిల్ కంపెనీలు నెప్పి తెలియకుండా ఉండేలా కొద్ది కొద్దిగా ధరలు పెంచుతూ తమ దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిత్యం 40 నుంచి 60 పైసల వరకు పెంచుతూ నిర్దయగా దోపిడీకి ప్రభుత్వమే దిగిపోయింది. ఒక పక్క విద్యుత్ బిల్లులు మోయలేని భారం గా ఉంటె మరోపక్క పెట్రోల్ బాదుడు తో ఇప్పుడు నిత్యవసరాలు సైతం కొండెక్కికూర్చునే పరిస్థితి దాపురించింది.

తోలు వలిచేస్తున్న టోల్ గేట్లు …

గత రెండు నెలలుగా కూడా టోల్ గేట్లు వాహనాల రాకపోకలు లేక బోసిపోయాయి. జాతీయ రహదారులు, పిపిఏ కింద నిర్మించిన రహదారులు వంతెనలపై టోల్ గేట్లు వేలం లో పాడుకున్న వారికి కోట్ల రూపాయాల లోనే నష్టం వాటిల్లింది. రవాణా బంద్ అయిన ఈ విలువైన కాలంలో రహదారుల మరమ్మత్తు పై కాంట్రాక్ట్ కంపెనీలు దృష్టి పెట్టలేదు కానీ తాము కోల్పోయిన ఆదాయం తిరిగి పొందడంపై బాగానే కసరత్తు చేశాయి. అందులో భాగంగా లాక్ డౌన్ 5.0 లో ఆంక్షలు సడలింపుతో రోడ్డెక్కిన వాహనాలపై ఎడాపెడా టోల్ వసూలు చేస్తున్నాయి.

కనికరం లేకుండా వసూళ్లు….

మామూలు రోజుల్లో రానూపోనూ కలిపి 24 గంటల్లో వెళ్ళి వచ్చే వారికి అప్ అండ్ డౌన్ చార్జీ కి కొంత తగ్గింపు ఉండేది. ఇప్పుడు ఆ విధానం తీసేసి కేవలం సింగిల్ టికెట్ నే టోల్ గేట్ కాంట్రాక్ట్ సంస్థలు వసూలు చేస్తూ దుర్మార్గంగా వాహనదారులనుంచి ముక్కుపిండి కష్టకాలంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇదేమి దారుణం అని ప్రశ్నించినా ఫలితం ఏమాత్రం ఉండటం లేదని వాహనాధారులు వాపోవడం మినహా చేసేదేమి ఉండటం లేదు. ప్రజలను కష్టాల్లో ఆడుకోవాలిసిన ప్రభుత్వాలు ఇలాంటి దుర్మార్గం నడుస్తున్నా నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరించడానికి కారణం రాజకీయ నేతల బినామీలు ఈ టోల్ కాంట్రాక్ట్ వెనుక ఉండే బడా బాబులు కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అనే చెప్పాలి.

Tags:    

Similar News