సాహసం చేయలేక… నిర్ణయం తీసుకోలేక?

ఎక్కడైనా ఏం జరగాలి? ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉన్న చోట బలమైన నాయకత్వాన్ని నియమించుకోవాలి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం [more]

Update: 2020-09-06 12:30 GMT

ఎక్కడైనా ఏం జరగాలి? ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉన్న చోట బలమైన నాయకత్వాన్ని నియమించుకోవాలి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. పార్టీ బలోపేతం కాకపోయినా పర్లేదు, తన నిర్ణయంతో ఎవరూ నొచ్చుకోకూడదన్న భావనలో ఉన్నట్లుంది. అందుకే దాదాపు పది నెలలుగా సత్తెనపల్లికి ఇన్ ఛార్జిని ఎవరినీ చంద్రబాబు నియమించలేదు. ఇది పార్టీలో మరింత అసంతృప్తికి దారితీస్తుందని చంద్రబాబు గ్రహించలేకపోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.

వైసీపీ బలహీన పడుతున్నా…..

సత్తెనపల్లిలో ప్రస్తుతం వైసీపీ రోజురోజుకూ బలహీన పడుతుంది. వైసీపీలోనే గ్రూపులు తయారయ్యాయి. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆ పార్టీలో మరొక గ్రూపు బలంగా తయారై ఆయనను ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో అధికారంలో ఉన్న పార్టీపై విరుచుకుపడాలంటే సరైన నేత అవసరం. కానీ టీడీపీ అధినేత మాత్రం లీడర్ ను నియమించే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో సత్తెనపల్లిలో వైసీపీలోని ఒక వర్గమే విపక్షంగా మారింది. టీడీపీ అస్సలు కన్పించడం లేదు.

కోడెల తర్వాత…..

కోడెల శివప్రసాద్ మరణించిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ ఛార్జి లేరు. కోడెల కుమారుడు శివరామ్ కు ఇవ్వాలని చంద్రబాబు తొలుత భావించారు. అయితే టీడీపీలోని ఒక వర్గం నేతలు కోడెల శివరామ్ రాకను వ్యతరేకిస్తున్నారు. కోడెల శివప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ 2019 ఎన్నికలకు ముందువీరు సత్తెనపల్లిలో ప్రదర్శన చేశారు. ఇక కోడెల కుటుంబానికి ఏదో ఒక న్యాయం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

ఎవరినీ నొప్పించకూడదని….

నరసరావుపేట ఇన్ ఛార్జి ఇవ్వాలని ఉన్నా అక్కడ చదలవాడ అరవింద్ బాబు యాక్టివ్ గా ఉన్నారు. ఇక కోడెల శివరామ్ తో పాటు సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ ఛార్జి పదవి కోసం రాయపాటి రంగరావుకూడా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరికే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికిస్తే మరొక కుటుంబం నొచ్చుకుంటుంది. రాయపాటి రంగారావుకు ఇవ్వకుంటే పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో సత్తెనపల్లి ఇన్ ఛార్జి విషయంలో చంద్రబాబు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీంతో సత్తెనపల్లిలో వైసీపీకి అప్పోజిషన్ వైసీపీయే అయింది. టీడీపీ అక్కడ క్రమంగా మాయమవుతోంది.

Tags:    

Similar News