కోలుకోవడం కష్టమేనటగా

ఏపీలో రెండు పార్టీలూ దొందుకు దొందే అన్నట్లుగా ఉన్నాయి. పదమూడు జిల్లాల ఏపీ ఏర్పాటయ్యాక అనుభవశాలి అని చంద్రబాబుని గద్దెనెక్కిస్తే 90 వేల కోట్ల అప్పుతో అప్పటికి [more]

Update: 2019-11-17 02:00 GMT

ఏపీలో రెండు పార్టీలూ దొందుకు దొందే అన్నట్లుగా ఉన్నాయి. పదమూడు జిల్లాల ఏపీ ఏర్పాటయ్యాక అనుభవశాలి అని చంద్రబాబుని గద్దెనెక్కిస్తే 90 వేల కోట్ల అప్పుతో అప్పటికి ఉన్న రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల పై చిలుకు చేసి కుర్చీ దిగిపోయారంటారు. మరి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఇపుడు బాబు తెచ్చిన అప్పులను చూసి తెగ జడుసుకుంటోంది. నిజమే రెండున్నర లక్షల కోట్ల వరకూ బడ్జెట్ ప్రవేశపెట్టిన కొత్త సర్కార్ కి ఈ అప్పులను చూస్తే గుండే బేజారవడం ఖాయమే. దాని సంగతి అలా ఉంచితే ఏపీలో అభివ్రుద్ధి అన్నది ఏదీ జరగలేదని కూడా వైసీపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు అయిదేళ్ళు అప్పులు తేవడం, దాన్ని అనవసర ఖర్చులు పెట్టడం చేశారని అంటున్నారు.

పెండింగుతో గుండె దడ….

ఇక ఏపీలో పెండింగు బిల్లులు పెద్ద ఎత్తున ఏర్చీ కూర్చీ తన నెత్తిన పెట్టి పోయారని కూడా బుగ్గన ఆవేదన చెందుతున్నారు. ఇన్ని రకాలుగా భారం వేస్తే మెమెలా తట్టుకునేది స్వామీ అంటున్నారు. ఆ వేల కోట్ల పెండింగు బిల్లులు తీర్చడం తమ వల్ల కాదని కూడా చేతులెత్తేస్తున్నారు. ఇక ఏపీలో ఖజానాను గుల్ల చేసి పెట్టారని కూడా బుగ్గన ఆందోళన‌ చెందుతున్నారు. నిజనే బుగ్గన బాధ కానీ టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కూడా ఇవే మాటలు వల్లించింది. అప్పులతో కట్టు బట్టలతో విడదీసిపంపారంటూ చంద్రబాబు ప్రతీ రోజు మీడియా సాక్షిగా కన్నీటి కధలు వినిపించేవారు. ఏపీని గాయాలపాలు చేశారని, సరైన సదుపాయాలు లేకుండా, అభివ్రుధ్ధి లేకుండా ఉత్త చేతులతో వదిలేశారని ఆయన నాడు చెప్పుకొచ్చేవారు. ఇవన్నీ విన్న ప్రజలకు ఇపుడు బుగ్గన ఏడుపు కొత్తగా కనిపించడంలేదు సరికదా విసుగు కూడా తెప్పిస్తోందంటే వింత లేదేమో మరి.

అందుకోసమా అసలు బాధ….

ఇక బుగ్గర ఏపీ ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అన్ని రకాల అప్పులు చేసేసి వెళ్ళిపోయారని అంటూనే తాము చేయాల్సిన అప్పులు కూడా చంద్రబాబే చేసేశారని చెబుతున్నారు. ఏపీలో గద్దెనెక్కిన పాలకులు అంతా అప్పులు మాత్రమే చేసి పప్పుకూడు పెట్టాలని బుగ్గన తీర్మానించేశారా అన్న విమర్శలు వస్తున్నాయి. ఏ రాష్ట్రం అయినా అభివ్రుధ్ధి చెందాలంటే ఆస్తులు పెంచాలి కానీ అప్పులు చేస్తే జరిగేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు జమానా బాగాలేదేనే జగన్ని తెచ్చి కూర్చోబెట్టారు, అయితే మేము కూడా అప్పులు చేస్తామని అంటున్న ఘనత వహించిన ఆర్ధిక‌ మంత్రివర్యులు అప్పులకు అవకాశం ఇవ్వలేదని వాపోవడమే పెద్ద విచిత్రం అంటున్నారు.

పప్పుబెల్లాలు రద్దు చేస్తేనే….

సంపదను పెంచితేనే రాష్ట్రాలకు స్థిరమైన ఆదాయాలు వస్తాయి కానీ ఓట్ల రాజకీయం కోసం సంక్షేమ పధకాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి పప్పు బెల్లాల మాదిరిగా పంచేస్తే ఎన్ని అప్పులు చేసినా సరిపోతాయా అన్నది ఒక చర్చగా ఉంది. ఇక ఏపీ ఖజానాలో డబ్బులు లేవని అంటే కేంద్రం అయినా పట్టించుకుందా అన్నదే పెద్ద ప్రశ్న. నాడు చంద్రబాబు కూడా చంద్రన్న కానులకు, వరాలు అంటూ ఇలాగే ఖర్చు చేయడం వల్లనే అప్పులు పెరిగాయి. ఇప్పటికైనా సంపద ఎలా వస్తుందో పాలకులు స్తిరమైన విధానాలతో ఆలోచన చేస్తే పది కాలాలపాటు ఏపీ పచ్చగా ఉంటుంది. లేకపోతే అప్పులకుప్పగానే మిగిలిఉంటుందని మేధావులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News