నిర్మలమ్మ పద్దుకోసం?

కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతన్నాయి. [more]

Update: 2020-01-31 18:29 GMT

కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతన్నాయి. ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా దిగువ, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్గించే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది.

ఆర్థిక వ్యవస్థను….

రెండోసారి బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుంది. ఉద్యోగ, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు వంటివి ఈ బడ్జెట్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. భారీ పెట్టుబడులు వచ్చే దిశగానే బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రైల్వే, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల విషయంలో పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చేలా ఈ బడ్జెట్ ఉండబోతుందని చెబుతున్నారు.

మౌలిక సదుపాయాలకు….

భారతదేశంలో గ్రామీణ వ్యవస్థ రోజురోజుకూ కుచించుకుపోతుంది. పట్టణీకరణ వైపుగా పయనిస్తుండటంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందని అంటున్నారు. అందుకోసమే ఈ బడ్జెట్ లో గ్రామీణ సంక్షేమీ రంగాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. మరో వైపు మధ్యతరగతి, ఉద్యోగవర్గాలను ఆకట్టుకునేందుకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచే అవకాశాలున్నాయి. మ్యానుఫ్యాక్చర్ రంగానికి కూడా ఊతమివ్వనున్నారు.

మోదీ ప్రత్యేక దృష్టి…..

ఈ బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మూడు నెలల నుంచి ఆయన బడ్జెట్ రూపకల్పనపై సలహాలు, సూచనలు అందచేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల సమయానికి మౌలిక సదుపాయాలకు వంద లక్షల కోట్లకు పైగానే నిధులు బడ్జెట్ కేటాయించే అవకాశముంది. ఎయిర్ ఎండియా వంటి తెల్ల ఏనుగును వదిలించుకునేందుకు నూరు శాతం వాటాలను అమ్మేసేందుకు సిద్ధమవుతుంది. మొత్తం మీద నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ జనరంజకంగానే ఉండబోతున్నా, కొన్ని కఠిన నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News