బొమ్మ పడింది…

  అధికారం మారితే ప్రభుత్వ కార్యాలయల నుంచి సర్కార్ పరిధిలోకి వచ్చే చోట అన్నిటా ముఖ్యమంత్రుల బొమ్మలు మారిపోతాయి. కొత్త ముఖ్యమంత్రుల బొమ్మలు కొలువు తీరతాయి. ఈ [more]

Update: 2019-06-23 13:21 GMT

 

అధికారం మారితే ప్రభుత్వ కార్యాలయల నుంచి సర్కార్ పరిధిలోకి వచ్చే చోట అన్నిటా ముఖ్యమంత్రుల బొమ్మలు మారిపోతాయి. కొత్త ముఖ్యమంత్రుల బొమ్మలు కొలువు తీరతాయి. ఈ మార్పిడి వ్యవహారాలు ఒక్కోసారి ఒక్కోచోటా రచ్చకు దారితీస్తాయి. ముఖ్యంగా స్థానిక పాలకవర్గాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ కాకుండా ప్రతిపక్షం ఉంటే రచ్చ మొదలు అవుతుంది. అలా కాక అధికారంలోకి వచ్చిన వారే స్థానిక సంస్థలకు నేతృత్వం వహిస్తే ఈ బొమ్మలు మారినా ఏ గొడవ ఉండదు. తాజాగా విజయవాడ కౌన్సిల్ లో ఈ బొమ్మల వివాదం ఏకంగా ఎన్టీఆర్, వైఎస్ బొమ్మల దాకా పోయింది.

అసలు ఏమైంది …?
విజయవాడ కౌన్సిల్ లో అధికారపక్షం టిడిపి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పక్కన పెట్టి కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో తగిలించారు. దీనికి మేయర్ కోనేరు శ్రీధర్ అంగీకరించలేదు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ తో సహా ఉంచాలన్నారు. దీనిపై వైసిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల నడుమ తీవ్ర వాగ్యుద్ధమే సాగింది. స్వర్గీయ వైఎస్ ఆర్ ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేయడంతో దానికి మేయర్ చివరికి అంగీకారం తెలపడంతో వివాదం సర్దుమణిగింది.

పాలన వదిలి … అనవసర అంశాలకు …
ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల్లో పదవుల్లో వున్న టిడిపి వారికి పదవీకాలం పూర్తి కానుంది. పదిరోజులు కూడా పట్టుమని తమ పాలనకు సమయం లేదు. వున్న సమయాన్ని ప్రజా సమస్యలు పరిష్కారానికి వినియోగించుకోవడం మానేసి రెండు ప్రధాన పార్టీలు కు చెందిన వారు కీచులాడుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎలానూ పాత పాలకవర్గాల సమయం పూర్తి అయితే వీరంతా మాజీ లు కావలిసిందే. అధికారులు అప్పుడైనా అధికారంలో వున్న ఫోటోలు తగిలించక తప్పదు. ఈలోగా బొమ్మల వంటి అనవసర అంశాలతో గోలపెట్టి రాజకీయాలపై ప్రజలకు మరింత విరక్తి కలిగిస్తున్నారు నేతలు.

Tags:    

Similar News