పంచాయితీల్లో బాబు బిజీ ?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు నేతల మధ్య తగవులు తీర్చే పనిలో చాలా బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఇతర పార్టీలనుంచి వచ్చే నాయకులకు టికెట్ హామీ లభిస్తే [more]

Update: 2019-02-08 12:30 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు నేతల మధ్య తగవులు తీర్చే పనిలో చాలా బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఇతర పార్టీలనుంచి వచ్చే నాయకులకు టికెట్ హామీ లభిస్తే కానీ పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు. అలా అని కొత్తవారికి ఛాన్స్ ఇస్తే ఈ సీట్ పై కన్నేసిన పార్టీవారితో తిప్పలు. ఇలా ముందు నుయ్యి వెనుక గొయ్యిగా కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఉండటంతో రిపేర్ చేసేందుకు నేరుగా అధినేతే రంగంలోకి దిగారు. నోటిఫికేషన్ కి సమయం దగ్గర పడుతూ ఉండటంతో ముందుగానే సమస్యాత్మక నియోజకవర్గాల్లో నేతల నడుమ సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు.

కడప, కర్నూల్ జిల్లాల్లో …

కడప కర్నూల్ జిల్లాల్లో నేతల నడుమ సాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించే ప్రయత్నాన్ని టిడిపి అధినేత మొదలు పెట్టేశారు. ముఖ్యంగా డోన్ టికెట్ పై వివాదం నెలకొనడంతో దానిపై ఫోకస్ పెట్టారు బాబు. ఇక్కడ మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టికెట్ కేటాయిస్తే టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే ఇప్పటికే ఈ సీటుపై కన్నేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి బాబు తీరుపై సీరియస్ గా వున్నారు. తమ కుటుంబానికే ఈ టికెట్ కేటాయించి తీరాలని ఆయన పట్టుబడుతున్నారు. మరోపక్క కడప జిల్లా జమ్మల మడుగు పంచాయితీ కొనసాగుతూనే వుంది. ఇక్కడ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్భారెడ్డి ల నడుమ నువ్వా నేనా అన్నస్థాయిలో వ్యవహారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను ఒప్పించి ఇక్కడి సమస్యకు తెరదించాలని టిడిపి అధినేత చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో అన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News