ఎవరిని వదిలిపెట్టడం లేదుగా…?

కరోనా ఎవరినీ వదలడం లేదు. వాళ్లు వీళ్లని కాదు. టోటల్ గా పెద్దోళ్ల నుంచి పేదల వరకూ కరోనా వదలిపెట్టకుండా వెంటబడుతోంది. ఇప్పటికే భారత్ లో యాభై [more]

Update: 2020-09-23 18:29 GMT

కరోనా ఎవరినీ వదలడం లేదు. వాళ్లు వీళ్లని కాదు. టోటల్ గా పెద్దోళ్ల నుంచి పేదల వరకూ కరోనా వదలిపెట్టకుండా వెంటబడుతోంది. ఇప్పటికే భారత్ లో యాభై లక్షల కేసులు దాటాయి. ఈ నెలాఖరుకు 65 లక్షల కరోనా కేసులు దాటేస్తాయని అంచనాలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా సమయం ఉండటంతో కరోనా కేసులు భారత్ లో ఇప్పట్లో ఆగేలా లేవు. అయితే రికవరీ రేటు కొంత పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశమని భారత ప్రభుత్వం పేర్కొంది.

పార్లమెంటును చూస్తేనే…?

పార్లమెంటు సమావేశాలను చూస్తేనే కరోనా ఎంత విలయ తాండవం చేస్తుందో చెప్పొచ్చు. దాదాపు 30 మంది ఎంపీలకు కరోనా సోకింది. తాజాగా కరోనా కారణంగా వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. పరీక్షలు చేసిన తర్వాతనే సమావేశాలకు అనుమతిస్తున్నా కరోనా మాత్రం ఆగడంలేదు. ఇక రాజ్యసభలో దాదాపు పన్నెండు మంది సభ్యులు కరోనాకు భయపడి ఈ వర్షాకాల సమావేశాలకు రాబోమని సెలవు పెట్టారంటే దాని తీవ్రతను చెప్పకనే తెలుస్తుంది.

అన్ లాక్ తర్వాతనే…..

ఇక భారత్ లో కరోనా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పట్లో ఆగదని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ అములులో ఉన్నప్పుడు అతి తక్కువ కేసులు నమోదయ్యేవి. అయితే అన్ లాక్4.0 తర్వాత భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానాన్ని, మరణాల్లో మూడో స్థానాన్ని ఆక్రమించడం ఆందోళన కల్గిస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటమే తప్ప తగ్గకపోవడం దేశఆర్థిక పరిస్థితిపైనా ప్రభావంచూపనుంది.

కేసులు ఇలా పెరిగాయి……

కరోనా వ్యాప్తిని ఒకసారి పరిశీలిస్తే మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి భారత్ లో 110 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత ఆ సంఖ్య పదిలక్షలు చేరుకోవడానికి 167 రోజుల సమయం పట్టింది. తర్వాత 21 రోజుల్లోనే పది లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాత 16 రోజుల్లో ముప్ఫయి లక్షలు, 13 రోజుల్లో నలభై లక్షల కేసులు, 11 రోజుల్లో యాభై లక్షల కరోనా కేసులు చేరుకోవడంతో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో ఇట్టే తెలుస్తోంది. కేవలం 41 రోజుల్లోనే నలభై లక్షల కేసులకు చేరుకుంది. సెప్బంబరు నెలలో వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు.

Tags:    

Similar News