ఏపీలో ఫేక్ సర్వేలపై తెలంగాణ సర్కార్ సీరియస్….!!!

ఎన్నికల పై వస్తున్న వార్తలో ఏది నిజమో ఏది ఫేకో? తెలుసుకోవడానికి ప్రజలకు కష్టంగా మారింది. ఎక్కడ చూసినా కూడా సర్వేల పేరుతో ఆ పార్టీ అధికారంలోకి [more]

Update: 2019-04-03 03:47 GMT

ఎన్నికల పై వస్తున్న వార్తలో ఏది నిజమో ఏది ఫేకో? తెలుసుకోవడానికి ప్రజలకు కష్టంగా మారింది. ఎక్కడ చూసినా కూడా సర్వేల పేరుతో ఆ పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఒక్కో మీడియా ఒక మాదిరిగా సర్వేలను బయటికి ప్రచురిస్తున్నాయి. ఈ సర్వేలో దీనిపైనా దృష్టి పెట్టకపోవడంతోవిచ్చలవిడిగా సర్వేల బయటకు వస్తున్నాయి. అయితే ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల పేరుతో ఒక మీడియా ఛానల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వే చూసిన ఇంటెలిజెన్స్ అధికారులు షాక్ అయ్యారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడ కూడా సర్వే నిర్వహించకపోయినప్పటికీ సర్వే పేరుతో బయట ప్రచారం జరుగుతోంది. దాన్ని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

తమను బదనాం చేసేందుకే….

ఆంధ్ర ప్రదేశ్ లో సర్వేల పేరిట తమను బదనాం చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇంటలిజెన్స్ తరపున ఎలాంటి సర్వే నిర్వహించలేదని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ఇంటలిజెన్స్ సర్వే పేరుతోటి ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఏపీ ఎన్నికల పై ఎలాంటి సర్వేలు తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించే లేదని ఆ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టిఎఫ్సి మీడియా సంస్థ పైన ఫిర్యాదు చేశారు. ఇందుకు కారణమైన శాఖమూరి తేజ బాబుతో పాటు మరి కొంత మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల సర్వే పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News