ఆత్మకూరులో జరుగుతున్నదిదే…!!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ విన్నా ఆత్మకూరు మాట. ఆత్మకూరు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆత్మకూరులో ఏం పరిస్థితులు ఉన్నాయి? ఎందుకింత గ్రామం [more]

Update: 2019-09-11 11:00 GMT

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ విన్నా ఆత్మకూరు మాట. ఆత్మకూరు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆత్మకూరులో ఏం పరిస్థితులు ఉన్నాయి? ఎందుకింత గ్రామం హైలెట్ అయింది? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇటు వైసీపీ, అటు తెలుగుదేశం పార్టీలు రెండూ ఆత్మకూరును రాజకీయం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఆత్మకూరులో నిజంగా టీడీపీ నేతలపై దాడులు జరిగాయా? లేక కొద్దిపాటి ఘర్షణలనే సాకుగా చూపి టీడీపీ తమకు అనుకూలంగా మలచుకుంటుందా? అన్నది రెండు పార్టీల నేతలూ చర్చించుకుంటున్న అంశం.

పల్నాడు ప్రాంతంలో…..

ఆత్మకూరు గ్రామం పల్నాడు ప్రాంతంలో ఉంది. గుంటూరు జిల్లాలోని దుర్గి మండలంలో ఆత్మకూరు గ్రామం ఉంది. ఇది చిన్న గ్రామం. మూడు వేల మంది జనాభా మాత్రమే ఇందులో నివసిస్తుంటారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉంటారు. అయితే తొలి నుంచి ఆత్మకూరు గ్రామానికి ఫ్యాక్షన్ గ్రామంగా ముద్రపడి పోయింది. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీలూ బలంగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీలకు చెందిన అగ్రకులాలకు చెందిన పెద్దలు ఇక్కడ ఎస్సీ,బీసీలను శాసిస్తుంటారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఉంటారు.

ఫ్యాక్షన్ గ్రామంగా….

2014 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆత్మకూరు గ్రామం నుంచి వైసీపీకి చెందిన కార్యకర్తలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. అప్పట్లో వైసీపీ జిల్లానేతలు ఈ గ్రామాన్ని పర్యటించి వారికి ధైర్యంచెప్పారు. అలాగే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో ఎన్నికల అనంతరం హింస ఇక్కడ జరిగే అవకాశముండటంతో పోలీసులు కూడా వారికి నచ్చ జెప్పి ఓటమి పాలయిన పార్టీ క్యాడర్ ను గ్రామం నుంచి పంపించి వేయడం ఆనవాయితీగా వస్తుంది.

పోలీసులే చెప్పి పంపడం…

ఇప్పుడు కూడా అదే జరిగింది. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి చెందిన దాదాపు 70 కుటుంబాలను వెళ్లిపోవాలని, ఇక్కడ ఉంటే ఘర్షణలు జరుగుతాయని పోలీసులే వారికి చెప్పారు. దీంతో వారు సమీప ప్రాంతంలో ఉండే తమ బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. అక్కడే ఉండి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటారు. ఆత్మకూరు గ్రామంలో ఏ పార్టీ గెలిచినా ఇది కామనే. పోలీసులు కూడా ముందు జాగ్రత్తగానే వారిని పంపించి వేస్తుంటారని పార్టీ నేతలే అంగీకరిస్తుంటారు. అసలే పల్నాడు.. ఆ పైన ఫ్యాక్షన్ విలేజ్. పైగా ప్రభుత్వం మారింది. దీంతోనే ఆత్మకూరులో టెన్షన్ వాతావరణం ఉందని పోలీసులు సయితం బహిరంగంగానే చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News