మహర్దశ పట్టినట్లేనా?

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన ఏమో గాని విజయనగరం జిల్లాలో మాత్రం భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక్కడ భూములు కొనే పరిస్థిితి లేదు. ఇప్పటికే వెంచర్లు [more]

Update: 2020-02-14 09:30 GMT

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన ఏమో గాని విజయనగరం జిల్లాలో మాత్రం భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక్కడ భూములు కొనే పరిస్థిితి లేదు. ఇప్పటికే వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్న వారి సంఖ్య రాజధాని ప్రకటనతో మరింత పెరిగిపోయింది. ప్రధానంగా విశాఖ పట్నం – విజయనగరం ప్రాంతాల మధ్య రియల్ వ్యాపారం ఊపందుకుంది. దీనికి ప్రధాన కారణం రాజధాని ప్రకటనే.

ఎయిర్ పోర్టు ప్రకటన నాటి నుంచే….

భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన నాటి నుంచే ఇక్కడ భూముల ధరలు చుక్కలనంటాయి. ఎయిర్ పోర్టు వస్తుండటంతో చుట్టుపక్కల భూములన్నీ రియల్ వెంచర్లతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన రావడంతో ఇది మరింతగా పెరిగింది. పేరున్న రియల్ సంస్థలన్నీ రంగంలోకి దిగి ఎకరాలకు ఎకరాలు భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నాయి. రాజధాని ఇక్కడే నంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి.

జీఎన్ రావు కమిటీ నివేదికతో….

రాజధాని ప్రకటనతో ముఖ్యంగా భీమిలి, పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లో భూములు కొందామన్నా దొరికే పరిస్థితి లేదు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన అంతా రియల్ వెంచర్లే కనపడుతున్నాయి. తగరపు వలస, ఆనందపురం మండలాల్లో కూడా రియల్ వ్యాపారం ఊపందుకుంది. దీనికి ప్రధాన కారణం జీఎన్ రావు కమిటీ నివేదిక అని చెబుతున్నారు. విశాఖకు ఉత్తరం వైపున నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మాణం జరగాలన్న కమిటీ నివేదిక ప్రకారం ఇక్కడే వస్తుందని రియల్టర్లు కొనుగోలుదారులను నమ్మ బలుకుతున్నారు.

కొందామన్నా లేవట….

దీంతో విశాఖపట్నం నుంచి విజయనగరం మధ్యలో భూములు ధరలు నింగినంటాయి. ఇక్కడ వెంచర్లు అధికంగా వేయడంతో గతంలో కన్నా ప్లాట్ల ధరలను రియల్టర్లు పెంచేశారు. మూడు రెట్లకు భూములు ధరలు పెరిగాయి. దీంతో రియల్ వ్యాపారం రాజధాని ప్రకటనతో ఊపందుకుంది. అయితే సామాన్యులకు మాత్రం ధరలు అందుబాటులో లేవు. మొత్తం మీద రాజధాని ప్రకటనతో విజయనగరం – విశాఖ మధ్యలో ప్రాంతానికి మహర్దశ పట్టిందనే చెప్పాలి.

Tags:    

Similar News