ఉంటారా? వెళ్లమంటారా? చంద్రబాబుపై ఆ నేత ఒత్తిడి…?

ఎవ‌రైనా ఎంత‌కాలం ఎదురు చూస్తారు ? అందునా.. రోజుకోర‌కంగా మారుతున్న రాజ‌కీయాల నేప‌థ్యంలో నాయ‌కులు ఎందుకు ఎదురు చూడాలి ? ప‌క్క పార్టీలు పిలుస్తుంటే.. ఉన్న పార్టీలో [more]

Update: 2020-08-03 08:00 GMT

ఎవ‌రైనా ఎంత‌కాలం ఎదురు చూస్తారు ? అందునా.. రోజుకోర‌కంగా మారుతున్న రాజ‌కీయాల నేప‌థ్యంలో నాయ‌కులు ఎందుకు ఎదురు చూడాలి ? ప‌క్క పార్టీలు పిలుస్తుంటే.. ఉన్న పార్టీలో ప‌ట్టించుకోన‌ప్పుడు .. ఎవ‌రు మాత్రం నిరీక్షిస్తారు ? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే గుంటూరు టీడీపీలో జోరుగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న కుమారుడి భ‌విష్యత్తును తేల్చేయాల‌ని చంద్రబాబుకు ఫోన్ చేసిన‌ట్టు చెబుతున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా త‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని అనుకున్న రాయ‌పాటికి చంద్రబాబు స్పందించ‌లేదు. దీంతో ఎట్టకేల‌కు ప‌డుతూ.. లేస్తూ.. ఆయ‌నే న‌ర‌సారావు పేట ఎంపీ టికెట్ తెచ్చుకుని యువకుడు లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు చేతిలో ఓట‌మిపాల‌య్యారు.

కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా….

దీంతో ఇక‌, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని, త‌న వార‌సుడికి చోటు క‌ల్పించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో త‌న కుమారుడికి ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం అప్పగించాల‌ని రాయ‌పాటి కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈయ‌న త‌న కుమారుడు రంగారావుకు ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం అప్పగించుకునేందుకు ప్రయ‌త్నిస్తూనే ఉన్నారు.కానీ, ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబు అవ‌కాశం ఇవ్వడం లేదు. పార్టీ నేత‌గా ఉన్నప్పటికీ.. ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని అప్పగించాల‌న్న.. రాయ‌పాటి కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే రాయ‌పాటి కోరిక త‌న వార‌సుడికి స‌త్తెన‌పల్లి సీటు అప్పగించాల‌ని ఉండేది. ఇక దివంగ‌త మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద‌రావు మృతి చెంద‌డంతో స‌త్తెన‌ప‌ల్లి పార్టీ ప‌గ్గాలు అయినా అప్పగించాల‌ని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కోరుతున్నా కోడెల అభిమానుల‌తో ఎక్కడ తేడా వ‌స్తోందో ? అని చంద్రబాబు నాన్చుతూ వ‌స్తున్నారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా….

ఇక‌, తాజాగా.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు బాబుకు ఫోన్ చేశార‌ని ప్రచారం జ‌రుగుతోంది. త‌మ‌కు ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని ఆయ‌న కోరార‌ని, అయితే, బాబు త్వర‌లోనే చెబుతాన‌ని అన్నార‌ని కూడా చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే, త‌న కుమారుడు రంగారావును వైసీపీలోకి పంపించేందుకు సాంబ‌శివ‌రావు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది. తాము ఎప్పటి నుంచో స‌త్తెన‌ప‌ల్లి బాధ్యత‌ల‌ను అప్పగించాల‌ని చంద్రబాబు కోరుతున్నామ‌ని, అయితే, ఆయ‌న స్పందించ‌లేదని.. ఏం చేయాలో తెలియ‌క నాన్నగారు దిగులు పెట్టుకున్నార‌ని రంగారావు కూడా అంటున్నార‌ట‌. ఇక‌, ఇటీవ‌ల కాలంలో టీడీపీ కార్యక్ర‌మాల‌కు ఈ కుటుంబం దూరంగా ఉంటోంది. కొన్నాళ్ల కింద‌ట రాజ‌ధాని ఉద్యమంలో పాల్గొన్న రంగారావు.. త‌ర్వాత త‌ర్వాత ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శిగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు కూడా తీసుకున్నారు.

వత్తిడి పెంచుతూ…..

ఇక ఇప్పుడు రాయ‌పాటిపై ట్రాన్స్‌ట్రాయ్ కేసు ఉంది. దీనిని తిర‌గ‌దోడుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ప్రతిప‌క్షంగా టీడీపీలో ఏదో ఒక ప‌ద‌వి లేక‌పోతే ఇక్కడ ఉండి వేస్ట్ అన్న నిర్ణయానికి రాయ‌పాటి వ‌చ్చేశార‌ట‌. పైగా జిల్లాలో ఖాళీ అయిన గుంటూరు వెస్ట్‌, బాప‌ట్ల, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించిన చంద్రబాబు తాము ఎప్పటి నుంచో అడుగుతున్న స‌త్తెన‌ప‌ల్లి సీటు విష‌యంలో తేల్చక‌పోవ‌డం ఆయ‌న‌లో తీవ్ర అస‌హ‌నానికి కార‌ణ‌మైంద‌ని టాక్‌. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాయ‌పాటి కుటుంబం చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోంద‌నే వ్యాఖ్యల‌కు బ‌లం చేకూరుతోంది. త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోతే.. పార్టీ మారేందుకు కూడా సిద్ధమ‌నే సంకేతాల‌ను పంపుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News