భరించక తప్పదా?

చంద్రబాబు నుంచి జేసీ దివాకర్ రెడ్డి వరకూ జమిలి ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఏడు నెలల్లోనే జగన్ సర్కార్ తమకు చుక్కలు చూపిస్తుండటంతో జమిలి ఎన్నికలు వస్తే [more]

Update: 2020-01-13 15:30 GMT

చంద్రబాబు నుంచి జేసీ దివాకర్ రెడ్డి వరకూ జమిలి ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఏడు నెలల్లోనే జగన్ సర్కార్ తమకు చుక్కలు చూపిస్తుండటంతో జమిలి ఎన్నికలు వస్తే బాగుండన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రిఫరెండం, ఎన్నికలకు వెళ్లాలని పట్టుబడుతుంటే, జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లేనని బీజేపీ నేతలు ముందు కుండబద్దలు కొట్టేస్తున్నారు.

జమిలి ఎన్నికలు వస్తాయని….

నిజానికి జమిలి ఎన్నికలకు మోదీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సిద్ధమయింది. ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మోదీ సర్కార్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే జమిలి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీల అభిప్రాయాన్ని సేకరించింది. ఎన్నికల కమిషన్ ను కూడా జమిలి ఎన్నికల నిర్వహణపై సూచనలను, సలహాలను స్వీకరించింది. దీంతో 2021 లో జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా జరిగింది.

ఆలోచన లేకపోవడంతో….

అయితే వరస ఓటములతో జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదు. హర్యానా, మహారాష్ట్రలో దెబ్బతినిడం, జార్ఖండ్ లో ఓటమి పాలు కావడంతో ఆర్టికల్ 370 వంటి, సీఏఏ వంటి అంశాలు తమకు కలసి వస్తాయని భావించినా పెద్దగా సానుకూలత రాకపోవడంతో మోదీ సర్కార్ కొంత వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలకు మొదటి నుంచి మోడీ సుముఖంగా ఉన్నారు. అభివృద్ధికి ఆటంకం ఉండదన్న అభిప్రాయమూ సర్వత్రా వ్యక్తమవుతోంది.

జేసీ ఆశలన్నీ…..

దీంతో రెండేళ్లలోనే ఏపీకి ఎన్నికలు వస్తాయని ఇక్కడి టీడీపీ నేతలు కూడా భావించారు. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు పదే పదే జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించేవారు. ఇటీవల బీజేపీ నేతలతో భేటీ అయిన జేసీ దివాకర్ రెడ్డి జమిలి ఎన్నికల గురించే వారివద్ద ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే తమ వద్ద సమాచారం లేదని చెప్పడంతో ఒకింత నిరాశకు గురయ్యారు జేసీ. చంద్రబాబుకు కూడా ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జమిలి ఎన్నికలు ఉండే అవకాశం లేదని తెలియడంతో నాలుగేళ్లు జగన్ ను భరించక తప్పదని చంద్రబాబు కూడా మానసికంగా సిద్ధమయ్యారు.

Tags:    

Similar News