క్యాలిక్యులేషన్లు అన్నీ రాంగేనా…?

మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. ఆయన బెంగుళూరులోని తన వ్యాపార కార్యక్రమాలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ ల మధ్యనే [more]

Update: 2019-08-22 12:30 GMT

మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. ఆయన బెంగుళూరులోని తన వ్యాపార కార్యక్రమాలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ ల మధ్యనే ఎక్కువగా అమర్ నాధ్ రెడ్డి తిరుగుతున్నారు. అమర్ నాధ్ రెడ్డి వాస్తవంగా వైసీపీలోనే ఉండేవారు. 2009లో టీడీపీ నుంచి, 2014 ఎన్నికల్లోనూ అమర్ నాధ్ రెడ్డి వైసీపీ తరుపున విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత తిరిగి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.

ఎమ్మెల్యేగా గెలిచినా….

అమర్ నాధ్ రెడ్డి టీడీపీ నేతగానే అందరికీ తెలుసు. ఆయన పొలిటికల్ క్యాలిక్యులేషన్లు అన్నీ రాంగ్ అవుతున్నాయి. 2009లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అమర్ నాధ్ రెడ్డి భావించారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 2014లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని భావించి అమర్ నాధ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడు కూడా అమర్ నాధ్ రెడ్డి లెక్కలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీీపీ టిక్కెట్ మీద గెలిచినా అమర్ నాధ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోవాల్సి వచ్చింది. కేవలం అధికారం మాత్రమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కింది.

వైసీపీలో ఉండి ఉన్నా….

నిజానికి అమర్ నాధ్ రెడ్డి వైసీపీలో కొనసాగి ఉంటే పలమనేరు నుంచి ఖచ్చితంగా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవారు. అయితే మంత్రి అయ్యేవారు కాదట. ఈ విషయాన్ని అమర్ నాధ్ రెడ్డి అనుచరులే బహిరంగంగా చెబుతున్నారు. వైసీపీలో ఉన్నా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం హవా ఉంటుందని, అమర్ నాధ్ రెడ్డికి పార్టీలో కొనసాగి ఉన్నా ఇప్పుడు మంత్రి పదవి దక్కేది కాదంటున్నారు. పెద్దిరెడ్డి నీడలో అమర్ నాధ్ రెడ్డి పార్టీలో ఎదగలేరనే అమర్ నాధ్ రెడ్డి వైసీపీలోకి వచ్చారన్నది ఆయన అనుచరుల వాదన.

టీడీపీలో ఉండి కూడా….

ఇప్పుడు టీడీపీకి కూడా భవిష్యత్తు లేదన్న నిర్థారణకు అమర్ నాధ్ రెడ్డి వచ్చారట. వరసగా అధికారంలోకి తాను వస్తుందనుకున్న పార్టీ రాలేకపోతుండటంతో ఈసారి ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. టీడీపీలో కొనసాగి వృధా అన్నది అమర్ నాధ్ రెడ్డి అభిప్రాయమని తెలుస్తోంది. అయితే ఇప్పుటికప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏడాది జగన్ పాలన చూసిన తర్వాత అడుగులు వేయవచ్చన్నది అమర్ నాధ్ రెడ్డి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అమర్ నాధ్ రెడ్డి క్యాలిక్యులేషన్లు ప్రతి ఎన్నికకూ తప్పవుతుండటంతో ఈసారి కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News