వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచేనా?

ఆళ్లగడ్డ రాజకీయాలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి అఖిలప్రియకు, అదే పార్టీకి చెందిన ఏవ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్రపన్నారని ఇప్పటికే పోలీసులు [more]

Update: 2020-06-06 08:00 GMT

ఆళ్లగడ్డ రాజకీయాలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి అఖిలప్రియకు, అదే పార్టీకి చెందిన ఏవ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్రపన్నారని ఇప్పటికే పోలీసులు అఖిలప్రియకు నోటీసులు అందచేశారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏ4, ఏ5 నిందితులుగా చేర్చారంటూ ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరూ వీరే కావడం గమనార్హం.

తన హత్యకు కుట్ర….

అఖిలప్రియ తాను ఆళ్లగడ్డలో జోక్యం చేసుకుంటున్నాననే తనపై పగ పెంచుకున్నారంటున్నారు ఏవీ సుబ్బారెడ్డి. తమ మధ్య ఆస్తుల గొడవలు ఏమీ లేవని, తనపై గతంలోనూ రాళ్ల దాడి చేయించారని చెబుతున్నారు. ఆళ్లగడ్డ లో తన ఓటమికి కారణమని భావించి తనను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు పార్టీకి కూడా ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియపై లేఖ రాశారు.

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వవద్దంటూ…

వచ్చే ఎన్నికలలో నంద్యాల, ఆళ్లగడ్డ టిక్కెట్లు భూమా కుటుంబానికి ఇవ్వవద్దని కూడా ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసే అవసరం తమకు లేదని అఖిలప్రియ చెబుతున్నారు. కావాలంటే ఆయన ఆళ్లగడ్డకు వచ్చి గంగుల కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయవచ్చని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని కూడా అఖిలప్రియ కోరారు. కానీ ఏవీ సుబ్బారెడ్డి ఎవరికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు.

వైసీపీకి అనుకూలంగా….

దీంతో టీడీపీలో ఉండే ఏవీ సుబ్బారెడ్డి వైసీపీకి అనుకూలగా పనిచేస్తున్నారన్నది అఖిలప్రియ అనుమానం. అది నేరుగా ఆమె చెప్పకున్నా అంతరార్థం అదేనని తెలుస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో ముందస్తు బెయిల్ కు భార్గవ్ రామ్ అప్లయ్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డి మాత్రం అఖిలప్రియ హస్తం ఉందని గట్టిగా చెబుతున్నారు. ఈ కేసు ఆళ్లగడ్డ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆళ్లగడ్డ, నంద్యాల రాజకీయాలపై భూమా, ఏవీ కుటుంబాల ఎఫెక్ట్ బాగానే పడే అవకాశముంది.

Tags:    

Similar News