పలుకు..ఊహాజనితమే

కొందరివల్ల కొన్ని జాతులు వర్ధిల్లుతాయి – ఇంకొందరివల్ల అంతరించిపోయాయి. ఈ పలుకు లో అమరావతి అభివృద్ధి విషయంలో జగన్ తన సన్నిహితుల వద్ద కమ్మ సామజిక వర్గం గురించి [more]

Update: 2019-12-29 08:02 GMT

కొందరివల్ల కొన్ని జాతులు వర్ధిల్లుతాయి – ఇంకొందరివల్ల అంతరించిపోయాయి. ఈ పలుకు లో అమరావతి అభివృద్ధి విషయంలో జగన్ తన సన్నిహితుల వద్ద కమ్మ సామజిక వర్గం గురించి చేసినట్టు చెపుతున్న వ్యాఖ్యలు అసంబద్ధంగానూ, ఊహాజనితంగానూ ఉన్నాయి. ఎందుకంటే ఒక వేళ జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసినా ఆయన సన్నిహితులతో/సన్నిహితులలో ఆర్కే లేరు. జగన్ సన్నిహితులెవ్వరూ ఆర్కేతో మాట్లాడరు. కాబట్టి ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఊహా జనితం. కమ్మ సామాజిక వర్గంలో ఆర్కే పుట్టాడో, ఆర్కే పుట్టినందుకే మిగిలిన వాళ్ళంతా ఆ సామాజిక వర్గంలో పుట్టారో అర్ధం కావడంలేదు. మనసులో ఎదో పెట్టుకొని ఇలాంటి రాతలు రాస్తే ఎవరి రాజకీయ ప్రయోజనాలకోసం రాస్తున్నారో ఆ ప్రయోజనాలతో పాటు మొత్తం ఆ సామాజిక వర్గం ప్రయోజనాలకే నష్టం జరుగుతోంది.

దురదను బురదగా చేసి….

ఈయన తన బురదను, దురదను మొత్తం సామాజిక వర్గానికి పూసేస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి ఉన్న ఏకైక మేధావి ఈయనే అన్నట్టు, ఆ సామాజిక వర్గ ఉద్ధరణకు పూనుకున్నట్టు రాసే ఇలాంటి పలుకులు ఆ సామాజిక వర్గంపై మరింత విద్వేషాన్ని పెంచుతున్నాయి. ఆ సామాజిక వర్గం మిగతాసమాజానికి దూరం అవుతోంది. ఈమధ్యనే ఓ మిత్రుడు చెప్పినట్టు “మనం ఇతర సామాజిక వర్గ ద్వేషానికి ఎందుకు గురవుతున్నామో విశ్లేషణ చేసుకొని, తప్పులుంటే దిద్దుకోవాలి. తప్పుడు ప్రచారం అయితే తిప్పికొట్టాలి.” బహుశా ఇలాంటి ప్రయత్నం ఆ సామజిక వర్గ పెద్దలు చేయాల్సిన సమయం వచ్చింది.

హక్కులు కట్టబెడితే…..

తమ రాజకీయ, మేధోపరమైన హక్కులు ఈ మేధావికి కట్టబెట్టి కూర్చుంటే ఆ సామాజిక వర్గానికి మిగిలేది ఆర్కే ఆశిస్తున్న సామూహిక ఆత్మహత్యలు కాకపోయినా సామూహిక బహిష్కరణ పరిస్థితులు వస్తాయి. వాస్తవానికి అలాంటి పరిస్థితి ఎదుర్కోవలసిన తప్పిదాలు కమ్మసామాజిక వర్గం చేయలేదు. వారు చేసేదల్లా అధికార దర్పం వెలగబెట్టే, అహంకారం ప్రదర్శించే నడమంత్రపు శ్రీమంతుల్ని భరించడమే. “నీవల్లే ఈ ఊరిలో అశాంతి రేగుతుందంటే నిన్ను ఈ ఊరు రానిచ్చేవాణ్ణి కాదు. నీవల్లే మీ అమ్మ చనిపోవాల్సి వస్తుందంటే నిన్ను దాని కడుపున పడనిచ్చేవాణ్ణికాదు” అని ఓ సినిమాలో ఓ తండ్రి తన కొడుకుతో చెప్పిన డైలాగు ఆర్కే లాంటి వారికి ఆ సామాజిక వర్గం చెప్పుకొని తమ గౌరవాన్ని తాము కాపాడుకోవాలి.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News