కరోనాను అంటించింది చైనా కాదట.. ఈ దేశమేనట

దేశంలో కరోనా వ్యాప్తికి, ఉదృతికి కారణమేంటి? ఇది నిజంగానే చైనా దేశంనుంచి వచ్ఛిందా? వేలకీలోమీటర్ల దుారంలోని డ్రాగన్ దేశం నుంచి మనదేశానికి రాగలదా? కరోనా కేంద్రమైన చైనాలోని [more]

Update: 2020-04-13 16:30 GMT

దేశంలో కరోనా వ్యాప్తికి, ఉదృతికి కారణమేంటి? ఇది నిజంగానే చైనా దేశంనుంచి వచ్ఛిందా? వేలకీలోమీటర్ల దుారంలోని డ్రాగన్ దేశం నుంచి మనదేశానికి రాగలదా? కరోనా కేంద్రమైన చైనాలోని హూబెయ్ ప్రావిన్స్ రాజధాని వూహన్ నగరం చైనా నడిబొడ్డున ఉంది. వూహన్ లో గతంలో బ్రిక్స్ -(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సు కూడా జరిగింది. అంత దూరంలో ఉన్న నగరం నుంచి వైరస్ సోకడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలకు నిర్దిష్టంగా సమాదానం లభించడం కష్టమే. అయితే ఈ కరోనా ఎక్కడ నుంచి ఏదేశం నుంచి వచ్చింది? అందుకు గల ఆధారాలేమిటి అన్న ప్రశ్నలకు శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కౌలాలంపూర్ లో జరిగిన….

కరోనా అనేది పూర్తిగా అంటువ్యాధి. మనుషులు, మనుషులు కలవడం ద్యారా సముాహాలుగా ఏర్పడటం ద్వారా, కలసి ప్రయాణించడం ద్వారా తేలిగ్గా సోకుతుంది. ఈ కోణంలో విశ్లేషణ చేస్తే భారత్ లో కరోనా వ్యాప్తికి ఆగ్నేయాసియా దేశమైన మలేషియా ఇందుకు కారణమని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇది ఆషామాషీగా అంచనా కాదు. తగిన ఆధారాలతో చెబుతున్న నిర్దిష్ట సమాచారం. దీనిని తోసిపుచ్చడం కష్టమే. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ఓ సదస్సు దక్షిణాసియాలో కరోనా వ్యాప్తికి కారణమని చెబుతున్నారు. తబ్లినీ సంస్ధ కౌలాలంపూర్ లో ఫిబ్రవరి 27 నుంచి 1 వరకు నిర్వహించిన సదస్సు ద్వారా దక్షిణాసియా దేశాలకు ము‌ఖ్యంగా భారత్ కు కరోనా విస్తరించిదని చెబుతున్నారు. కౌలాలంపూర్ లోని పెటాలింగ్ అనే మసీదులో 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. ఇందులో దాదాపు 1500 మంది విదేశీ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న 34 ఏళ్ళ ఓ మలేసియా వాసి మెుదట మరణించారు.

ఆ సమావేశం ద్వారానే…

ఆ దేశంలో నమెాదైన పాజిటివ్ కేసుల్లో ముాడోవంతు జమాత్ తో సంబందం ఉన్న వ్యక్తులేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. కౌలాలంపూర్ సదస్సుకు హాజరైన ప్రతినిధులు తమ సొంత దేశాల్లో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు. ఈ సదస్సుకు హజరైన 31 మంది ఇండోనేసియా వాసులు ఢిల్లీ సదస్సులో పల్గొన్నారు. వీరిద్వారా వైరస్ విస్తృతంగా వ్యాప్తి అయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు హాజరైన సంస్థలకు వెళ్ళిన వారిలో పలువురికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి రైల్లో తెలంగాణా, రామగుండం వచ్చిన ఇండోనేసియన్లకు 10 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఢిల్లీ సదస్సుకు హాజరైన ఓ కాశ్మీరీ మార్చి 26న కన్నుముాశారు. మర్కజ్ నుంచి మార్చి 27 న ఆరుగురిని, 28న 33 మందిని క్వారంటైన్ కు తరలించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో వెలుగు చూసిన పాజిటివ్ కేసులకు, మర్కజ్ సమావేశాలకు సంబంధం ఉన్నట్లు తేలింది.

ఇరవై రాష్ట్రాల నుంచి….

మర్కజ్ సమావేశాలకు మనదేశంలోని 20 కి పైగా రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, యుాపి, పంజాబ్, రాజస్ధాన్, ఢిల్లీ, మణిపూర్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రల ప్రతినిధులు హాజరయ్యారు. వీరు ఢిల్లీ లోని సమావేశాలు ముగించుకుని తమ తమ స్వరాష్ట్రాలకు వెళ్ళిన తర్వాతే పాజిటివ్ కేసులు వెలుగు చూడటం గమనార్హం. అంతకు ముందు ఆయా రాష్ట్రాల్లో వెలుగుచుాసిన పాజిటివ్ కేసులు బహుస్వల్పం. అంటే ఈ వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందలేదన్నది వాస్తవం. మనుషుల సంచారం, సమీపంలోనే సముాహాలుగా ఏర్పడటం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. గాలిద్వారా వ్యాప్తి చెందదని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ స్పష్టం చేసింది. అలా అయ్యేటట్లయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాధి ప్రబలాలి. గాలి ద్వారా వ్యాపించేటట్లయితే ప్రతిఒక్కరుా ఒకే రకమైన గాలిని పీలుస్తారు. అలాంటప్పుడు అందరికీ రావాలి. కానీ సమీపంలోని వ్యక్తుల ద్వారానే ఇది సంక్రమిస్తుందని నిపుణులు నిర్ధారిస్తున్నారు. అందువల్ల దుారం పాటించడం వల్ల, పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ద్వారానే ఈ సరికొత్త మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్న విషయాన్ని ప్రతీ ఒక్కరుా గ్రహించాలి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News