ఫేస్ చూపించడం…?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌లు గంద‌ర‌గోళంలో ఉన్నారు. ఇక్క‌డ త‌మ‌కు దిక్కులేకుండా పోయింద‌ని వాపోతున్నారు. త‌మ‌ను న‌డిపించే వారు ఎవ‌రని? వారు ప్రశ్నిస్తున్నారు. [more]

Update: 2019-07-27 03:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌లు గంద‌ర‌గోళంలో ఉన్నారు. ఇక్క‌డ త‌మ‌కు దిక్కులేకుండా పోయింద‌ని వాపోతున్నారు. త‌మ‌ను న‌డిపించే వారు ఎవ‌రని? వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు కొవ్వూరు నియో జ‌క‌వ‌ర్గంలో టీడీపీ రాజ‌కీయం మ‌రోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన కొవ్వూరులో బ‌ల‌మైన కేడ‌ర్ టీడీపీ సొంతం. పార్టీ పెట్టిన త‌ర్వాత ఒక‌టి రెండు సార్లు త‌ప్పితే.. ప్రతిసారీ ఇక్కడ టీడీపీ విజ‌యం సాధిస్తూనే ఉంది. నాయ‌కులతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రజ‌లు టీడీపీకి జై కొడుతున్నారు.

వ్యతిరేకత రావడంతో….

ఈ క్రమంలోనే 2014లో స్థానికేత‌రుడైన జ‌వ‌హ‌ర్‌ను చంద్రబాబు ఇక్కడ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఆయన‌కు త‌ర్వాత కాలంలో మంత్రి ప‌ద‌వి కూడా అప్పగించారు. ఇక‌, ఆయ‌న‌పై తీవ్రమైన వ్యతిరేక‌త పెల్లుబుక‌డంతో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఆయ‌న‌ను కృష్ణాజిల్లా తిరువూరుకు బ‌దిలీ చేసి.. ఆ స్థానంలో విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యేగా ఉన్న వంగ‌ల‌పూడి అనిత‌కు ఇక్కడి టికెట్ ఇచ్చారు. ఈమె కూడా ఇక్కడ స్థానికేత‌రురాలే అయిన‌ప్ప టికీ.. పార్టీ కేడ‌ర్ బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో విజ‌యం ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు ఆమె కూడా బొక్క బోర్లా ప‌డింది.

అడ్రస్ లేకుండా….

అయితే, సాధార‌ణంగా ఎంత ఓడిపోయినా.. ఎన్నిక‌ల్లో త‌న వెంట ఉన్న కేడ‌ర్‌లో మ‌నోధైర్యం నింపేందుకు ఓడిపోయిన నాయ‌కులు అక్కడ త‌ర‌చుగా ప‌ర్యటించ‌డం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించ‌డం, వారితో స‌మావేశం అవుతుండ‌డం, పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం, ప్రతిప‌క్షంలో ఉన్న పార్టీ త‌ర‌ఫున ఓడిపోయిన‌ప్పటికీ.. గ‌ళాన్ని వినిపించ‌డం అనేది స‌ర్వసాధార‌ణం. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు వంగ‌ల‌పూడి అనిత‌ కొవ్వురు మొహం చూసింది లేదు. ఇక్కడి కేడ‌ర్‌తో క‌నీసం ఫోన్‌లో కూడా ప‌ల‌క‌రించింది లేదు.అస‌లు నాకెందుకు అనే స్థాయిలో ఆమె దూర‌మ‌య్యారు. దీంతో ఇక్కడ కేడ‌ర్ గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది.

నడిపించే వారు ఏరీ….?

ఈ నేప‌థ్యంలో వారు ఇప్పటికైనా స్థానిక నాయ‌కుడిని బ‌లోపేతం చేయాల‌ని, అధిష్టానం ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టాల‌ని కోరుతున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. ఇక్క‌డ నుంచి వెళ్లి తిరువూరులో పోటీ చేసిన మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ ఓడిపోయినా.. అక్కడి కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటున్నారు. వారి స‌మ‌స్యలు తెలుసుకుంటున్నారు. అధికార ప‌క్షంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. దాడుల‌ను ఖండిస్తున్నారు. మ‌రి తాము జ‌వ‌హ‌ర్‌ను కాదంటేనే వంగ‌ల‌పూడి అనిత‌కు ఇక్కడ సీటు వ‌చ్చింద‌ని… ఓడిపోయినంత మాత్రాన పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో లేకుండా పోతే ఎలా ? అని ఇక్కడి కేడ‌ర్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా టీడీపీకి కంచుకోట‌గా ఉండి కూడా కొవ్వూరులో ఆ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేకుండా పోయాడు.

Tags:    

Similar News