అమెరికా ఎందుకు పనికొస్తుంది దీనిముందు?

ఆధునికతకు, నాగరికతకు మారుపేరుగా, ప్రపంచానికి మార్గదర్శిగా భావించుకునే ఐరోపా ఖండం కరోనా దెబ్బకు కకావికలమవుతోంది. దీనిని అధిగమించే మార్గం తెలియక తలపట్టుకుని కుార్చుంది. ఈ ఖండంలోని ఇటలీ, [more]

Update: 2020-04-20 16:30 GMT

ఆధునికతకు, నాగరికతకు మారుపేరుగా, ప్రపంచానికి మార్గదర్శిగా భావించుకునే ఐరోపా ఖండం కరోనా దెబ్బకు కకావికలమవుతోంది. దీనిని అధిగమించే మార్గం తెలియక తలపట్టుకుని కుార్చుంది. ఈ ఖండంలోని ఇటలీ, స్పెయిన్ లో మరణమృదంగం మోగుతోంది. వేల మరణాలు సంభవించాయి. ఇదే తరహాలోనే బ్రిటన్ బిక్కు బిక్కు మంటోంది. సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా దెబ్బకు ఆస్పత్రి పాలయ్యారు. నిన్న మెున్ననే డిశ్చార్జయ్యారు. పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. అందరుా చిన్నచుాపు చుాసే, చీకటి ఖండంగా పేర్కొనే ఆఫ్రికా ఖండం కరోనా నియంత్రణలో మెరుగైన పనితీరే కనబరిచింది. అభివృధ్ధికి దుారంగా, వెననుకబడిన ప్రాంతమైన ఆఫ్రికా పేదరికానికి మారుపేరుగా నిలుస్తోంది. అయినప్పటీకీ కరోనాను చాలా వరకు అడ్డుకోగలిగింది. ముఖ్యంగా ఈ ఖండంలోని ఇధియెాపియా కరోనా నియంత్రణలో అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయంలో ఆదేశానిది కచ్చితంగా విజయగాధగా పేర్కొనవచ్చు. ముందస్తు ప్రణాళిక, ప్రజాల్లో అవగాహన, చైతన్యం ద్వారానే ఈ విజయం సిధ్ధించింది.

అనధికార లాక్ డౌన్ తో….

ఇధియెాపియా….. ఈ పేరు చాలామందిని తెలియకపోవచ్చు. ఇదేమీ అభివృద్ధి చెందిన దేశంకాదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమించిన దేశం కాదు. అయినా పొంచివున్న కరోనా ముప్పును గమనించి నియంత్రించడంలో విజయవంతమైంది. రమారమి 11 కోట్లు జనాభా గల ఇధియెాపియాది అతి చిన్న ఆర్ధిక వ్యవస్ధ. లాక్ డౌన్ ప్రకటిస్తే మరింత దెబ్బతింటుదన్న ముందు చూపుతో ప్రజాల్లో అవగాహనకు నడుం బిగించింది. అత్యవసర పని ఉన్నవారు తప్ప మిగతా వారు ఎవరూ బయటకు రావద్దని ఆదేశించింది. అంతే తప్ప అధికారికంగా లాక్ డౌన్ విధించలేదు. బయట సంచరించే వారు కుాడా కనీసం మీటరు దుారం పాటించాలని స్పష్టంచేసింది. ప్రజలు కుాడా ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. దేశ సరిహద్దులను మూసేసింది. విమానాలను రద్దు చేసింది. రాజధాని నగరం అడిస్ అబాబాలో ఆంక్షలు విధించింది. విద్యా సంస్ధలను ముాసేసింది. అవకాశం ఉన్న వారందరినీ ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. వాహనాల్లో సీటుకు ఒకరే కూర్చోవాలని, ఆటోల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని పేర్కొంది. ప్రజాల్లో అవగాహన, చైతన్యం కల్పించడం కోసం 35 వేలమంది వాలంటీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రయత్నాలు వృధా కాలేదు. సత్పలితాలను ఇచ్చాయి.

హెల్త్ ఎమెర్జెన్సీ….

దేశవ్యాప్తంగా కేవలం 65 పాజిటివ్ కేసులు నమెాదు కావడమే ఇందుకు నిదర్శనం. వీటిల్లో రాజధాని అడిస్ అబాబాలో నమోదయినవి 52 మాత్రమే కావడం గమనార్హం. రాజధాని మినహా మిగతా దేశంలో నమెాదైన కేసుల కేవలం 13 మాత్రమే. రాజధాని పరిస్ధితిని గమనించిన ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రజలను మరింతగా అప్రమత్తంచేసింది. ఇప్పుడిప్పుడే రాజధానిలో పరిస్ధితి కుదుటపడుతోంది. కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. ఇధియెాపియా ఆహార అలవాట్లు కుాడా కరోనా నియంత్రణకు దోహదపడ్డాయి. ఆదేశ ప్రజలు ఎక్కువగా ‘ ఇంజీరా ‘ అనే ఆహారాన్ని తిసుకుంటారు. పిండితో తయారుచేసే ఈ ఆహారంలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. దేశంలో 80 శాతం గ్రామీణ ప్రాంతాలే. ఫలితంగా కాలుష్యం సమస్య తక్కువగా ఉంది. ఇవన్నీ ప్రజల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతున్నాయి. అన్నింటికీ మించి ప్రజల స్వీయ క్రమశిక్షణ ఆదేశాన్ని కరోనా రహితంగా మార్చింది. ఇధియెాపియా ప్రజలు అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News