‌‌Huzurabad : అది పనిచేస్తేనే ఇక్కడ గెలుపట

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడం బీజేపీ నేత ఈటల రాజేందర్ కు అంత సులువు కాదు. ఓటమి అనేది తెలయకుండా గెలుస్తున్న ఈటల రాజేందర్ కు ఈసారి [more]

Update: 2021-10-08 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడం బీజేపీ నేత ఈటల రాజేందర్ కు అంత సులువు కాదు. ఓటమి అనేది తెలయకుండా గెలుస్తున్న ఈటల రాజేందర్ కు ఈసారి మాత్రం ఈ ఎన్నిక కత్తిమీద సవాలేనని చెప్పాలి. ఆయన కేవలం సానుభూతిపైనే ఆశలు పెట్టుకున్నారు. తాను బీసీ వర్గానికి చెందిన వాడిని కావడంతోనే మంత్రి వర్గం నుంచి తప్పించారని, లేని పోని ఆరోపణలు చేశారని ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటి వరకూ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏం చేయలేకపోయారని కూడా ఆయన నిలదీస్తున్నారు.

సానుభూతి కోసం….

ఈటల రాజేందర్ కు బలమైన అనుచరవర్గం హుజూరాబాద్ లో ఉంది. దశాబ్దకాలంగా అక్కడే ఉండటంతో పేరుతో పిలిచే క్యాడర్ ఆయనకు సొంతం. అదే ఆయనకు నమ్మకం. ఉద్యమకాలం నుంచి నమ్మకంగా ఉన్న తనను బయటకు నెట్టేశారని ఈటల రాజేందర్ చేస్తున్న ప్రచారం ప్రజలు నమ్మితే మరోసారి ఓటర్లు పట్టం కట్టే అవకాశముంది. అయితే ఈ రెండేళ్లలో హుజూరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని భావిస్తే మాత్రం ఈటలకు కొంత ఇబ్బందులు తప్పవు.

టీఆర్ఎస్ అన్ని రకాలుగా….

హుజూరాబాద్ ఉప ఎన్నిక నాగార్జున సాగర్ అంత ఈజీ కాదని తెలుసు. అక్కడ సెంటిమెంట్ పనిచేసింది. కానీ ఇక్కడ సెంటిమెంట్ ఈటల రాజేందర్ వైపు ఉంది. అందుకే దళితబంధు వంటి అధిక వ్యయంతో కూడిన పథకాన్ని తేవడానికి కూడా కేసీఆర్ వెనకాడ లేదు. ఈటల రాజేందర్ ప్రధాన అనుచరులందరికీ పదవులు ఇచ్చి మరీ పార్టీలోనే కొనసాగేలా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈటలకు గ్రామాల వారీగా చెక్ పెట్టేశారు.

బీసీల్లో చీలిక వస్తే….

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని రకాల ప్లాన్ లను అమలు చేస్తుంది. దళిత బంధుతో పాటు బీసీ బంధును కూడా అమలు చేస్తామని చెబుతుండటం ఈటల రాజేందర్ ఓటు బ్యాంకుకు భారీగా గండికొట్టినట్లే అవుతుంది. అదే సామాజివర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపింది. అదే ఈటల రాజేందర్ కు టెన్షన్ పట్టుకుంది. మొత్తం మీద సానుభూతి పనిచేస్తే తప్ప ఈటల రాజేందర్ గెలుపు అంత సులువు కాదు.

Tags:    

Similar News