ఈటల గెలుపు అంత ఈజీ కాదట

హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే వేడెక్కింది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియరు. అయినా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హుజూరాబాద్ లో మొదలు [more]

Update: 2021-08-08 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే వేడెక్కింది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియరు. అయినా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హుజూరాబాద్ లో మొదలు పెట్టాయి. ఇక బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రారంభించిన పాదయాత్ర కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈటల రాజేందర్ కు గెలుపు పై అనుమానాలు వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి తనను ఓడస్తారన్న భయం ఈటల రాజేందర్ లో ప్రతి క్షణం కన్పిస్తుంది.

బలమైన నేతగా…

అందుకే తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న ఆరోపణలను పదే పదే చేస్తున్నారు. సానుభూతి కోసం చేసే ప్రయత్నాల్లోనే ఈ కామెంట్స్ చేస్తున్నారనుకోవాలి. ఈటల రాజేందర్ స్వతహాగా బలమైన నేత కాదనే చెప్పాలి. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత అయినా వారికి అధికారంలో ఉన్ననాళ్లు దూరంగానే ఉన్నారు. పార్టీ అండతోనే ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం కొనసాగిందని చెప్పాలి.

అన్నీ సమస్యలే…

ఇక ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు అనేక సమస్యలున్నాయి. ప్రధానంగా పార్టీ. బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం ఈటల రాజేందర్ కు మైనస్ అనే చెప్పాలి. బీజేపీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి ఉంది. నిత్యావసరాల ధరలు పెరగడం, పెట్రోలు ధరలు వందను దాటడం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితి ఈటల రాజేందర్ కు నష్టమే తెచ్చిపెడుతుందంటున్నారు.

ఇబ్బంది పెడుతున్న గుర్తు….

మరోవైపు గుర్తు సమస్య కూడా ఈటల రాజేందర్ ను వేధిస్తుంది. ఆరుసార్లుగా కారు గుర్తు మీద గెలిచిన ఈటల రాజేందర్ ఈసారి గుర్తు మార్చడం కూడా మైనస్ గానే చెప్పాలి. ప్రజల్లో కారు గుర్తు బలంగా నాటుకుపోయింది. అందుకే ఈటల రాజేందర్ బీజేపీ గుర్తు అయిన కమలాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తన ప్రతి మాటలోనూ గుర్తు విషయం చెబుతున్నారు. దీంతో పాటు ఆరుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలవడంతో సహజంగా ఉండే అసంతృప్తి ఎలానూ ఉంటుంది. మొత్తం మీద ఈటల రాజేందర్ కు ఈ సారి ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News