Etala : ఈటల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒడ్డున పడేశారా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ లో కొత్త ధైర్యం నింపిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికలకు టిక్కెట్ల భయం లేకుండా పోయింది. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వరనే భయం ఈ [more]

Update: 2021-11-03 00:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ లో కొత్త ధైర్యం నింపిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికలకు టిక్కెట్ల భయం లేకుండా పోయింది. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వరనే భయం ఈ ఎన్నికలతో చాలా మందిలో పోయిందంటున్నారు. కేసీఆర్ టిక్కెట్ల కేటాయింపులో నిర్దయగా వ్యవహరిస్తారు. 2018 ఎన్నికల్లో కొండా సురేఖ వంటి నేతలకే కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవులను కూడా సీనియర్లను పక్కన పెట్టి కొత్త నేతలకు అవకాశం కల్పించారు.

గెలిచి ఉంటే…?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి ఉంటే అదే యాటిట్యూడ్ ను ప్రదర్శించే వారు. కానీ ఈటల రాజేందర్ ఓటమి పాలు కావడంతో ఇక పార్టీకి నేతలను దూరం చేసుకునే ధైర్యాన్ని కేసీఆర్ చేయరు. ఆ నమ్మకం ఇప్పటికి నేతల్లో కలుగుతుంది. నిజానికి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిన ఊహించలేదు. తన పథకాలే తనను గెలిపిస్తాయని భావించారు. తన స్కీమ్ లు వర్క్ అవుట్ అవుతాయనుకున్నారు.

ఘోర పరాజయంతో….

కానీ ఇంత ఘోర పరాజయాన్ని కేసీఆర్ కూడా ఊహించలేదు. ప్రజలు సానుభూతికే జై కొట్టారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలు చేేసే పరిస్థితులు లేవు. కానీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నది స్పష్టమవుతుంది. ఎమ్మెల్యేలపైనే కాకుండా వివిధ అంశాలతో ప్రభుత్వంపైన కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని రూపుమాపాలంటే కేసీఆర్ ఈ రెండున్నరేళ్లు పెద్దయెత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది.

పథకాలు సయితం….

కేవలం ఒక సామాజికవర్గానికి లబ్ది చేకూరిస్తే మిగిలిన సామాజికవర్గాలు దూరమవుతాయని దళిత బంధు పథకం అమలు చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తేలింది. దీంతో కేసీఆర్ ఆచితూచి పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. నిన్ననే ప్లీనరీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న అతి విశ్వాసాన్ని ప్రకటించిన కేసీఆర్ ఈసారి విజయం కోసం మరిన్ని దారులు వెతుక్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నట్లే కనపడుతుంది.

Tags:    

Similar News