తిరుపతి రిజల్ట్ లో తేడా కొడితే.. టెన్షన్ టెన్షన్?

వైసీపీలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపును పక్కన పెట్టి మెజారిటీని జగన్ చూస్తుండటంతో వీరంతా రేయినకా పగలనకా చెమటోడ్చారు. [more]

Update: 2021-04-16 08:00 GMT

వైసీపీలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపును పక్కన పెట్టి మెజారిటీని జగన్ చూస్తుండటంతో వీరంతా రేయినకా పగలనకా చెమటోడ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం ఎప్పుడో తేలిపోయిందన్నది వైసీపీ చీఫ్ జగన్ భావన. అయితే జాతీయ స్థాయిలో తిరుపతి పేరు మార్మోగాలంటే మెజారిటీ ఒక్కటే మార్గమని ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు.

ఏడు నియోజకవర్గాల్లో…..

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్భయి నుంచి ఎనభై వేల వరకూ మెజారిటీ రావాలన్న లక్ష్యంగా జగన్ విధించారు. దీంతో ఎమ్మెల్యేలు అంత మెజారిటీ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ లో వైసీపీ ఎమ్మెల్యేలున్నారు.

తిరుపతి, గూడూరు లలో….

ముఖ్యంగా తిరుపతి నియోజవర్గంలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థికే మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ భూమనకు అతి తక్కువ మెజారిటీ వచ్చింది. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి రేయింబవళ్లూ తిరుగుతున్నారు. అలాగే గూడూరు నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ పై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఇక్కడ కూడా వైసీపీ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

మంత్రుల్లోనూ టెన్షన్….

ఇక ఏడు నియోజకవర్గాలకు జగన్ మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి, కురసాల కన్నబాబులను నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. దీంతో వీరు ఇక్కడే మకాం వేసి ప్రచార బాధ్యతలను చేపట్టారు. వీరంతా కూడా టెన్షన్ లోనే ఉన్నారు. మొత్తం మీద తిరుపతి రిజల్ట్ అనేక మంది వైసీపీ నేతల భవిష్యత్ ను మార్చబోతుందన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి.

Tags:    

Similar News