ఏలూరులో పాగా వేసేదెవ‌రు..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరులో రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ హ‌వా ఎలా ఉంది? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏ పార్టీ గెలుపు గుర్రం [more]

Update: 2019-02-07 16:00 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరులో రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ హ‌వా ఎలా ఉంది? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏ పార్టీ గెలుపు గుర్రం ఎక్కేందుకు రెడీ అవుతోంది? ఇక్క‌డ ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ప‌్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి గెలిచే ఛాన్స్ ఉందా? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకున్న క్ర‌మంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంనూ పార్టీలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏలూరులోనూ పార్టీలు వేటిక‌వే స‌త్తా చూపించేందుకు రెడీ అయ్యాయి. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీల మ‌ధ్య పోరు భారీ ఎత్తున సాగుతుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు బ‌డేటి బుజ్జి విజ‌యం సాధించారు.

కొంత సానుకూల‌త‌… మ‌రింత వ్య‌తిరేక‌త‌..

టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏలూరు కొంత‌మేర అభివృద్ధి జ‌రిగింది. ఏలూరును స్మార్ట్ సిటీగా గుర్తించ‌డంతో కోట్లు వెచ్చించి ఇక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దీంతో అధికార పార్టీకి ఇక్క‌డ బ‌లమైన పునాది ప‌డింద‌న‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కుడిగా ఉన్న బ‌డేటి కోట రామారావు ఉర‌ఫ్ బుజ్జికి ఇక్క‌డ సానుకూల‌త పెరిగింది. అదే టైంలో సెటిల్మెంట్లు, బెదిరింపుల నేప‌థ్యంలో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త కూడా ఉంది. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ముక్కోణ‌పు పోరు సాగింది. ఈ క్ర‌మంలో ఇక్క‌డ కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఆళ్ల నాని విజయం సాధించారు. అయితే, 2014 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఇక్క‌డ నుంచి 2014లో టీడీపీ అనుకూల ప‌వ‌నాలు వీచాయి. దీంతో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన బ‌డేటి విజ‌యం సాధించారు.

గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న వైసీపీ

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా ప్ర‌ధాన పోటీ వీరిద్ద‌రి మ‌ధ్యే ఉండ‌నుంద‌నేది వాస్త‌వం. ఇప్ప‌టికై వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల నాని అప్ర‌క‌టిత అభ్య‌ర్థిగా ఉన్నారు. ఇక‌, టీడీపీ సిట్టింగ్ బుజ్జి కూడా టికెట్ ఖరార‌నే తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ మ‌ళ్లీ వారు ఈ ఇద్ద‌రి మ‌ధ్యే జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అయితే, జన‌సేన కూడా ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కా శం లేకపోలేదు. ఈ పార్టీ త‌ర‌పున సాగ‌ర్, శేషు ఇద్ద‌రూ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఆయ‌న ఎవ‌రికి టికెట్ ఇస్తార‌నే విష‌యం తేల‌లేదు. అయితే, ప‌వ‌న్ ప్ర‌భావం మాత్రం ఉంటుంద‌నేది వాస్త‌వం. ఒకానొక ద‌శ‌లో ఇక్క‌డ నుంచి ప‌వ‌నే పోటీకి దిగుతార‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బుజ్జికి ప‌వ‌న్ ప్ర‌చారం కూడా చేశారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏలూరులో మూడు పార్టీల మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్ ఖాయం. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డి రాజకీయంపై ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

Tags:    

Similar News