ఏలూరి ‘ లో ఇంత హుషారా…?

ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన ఏలూరి సాంబ‌శివ‌రావు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రకోసం ప్లానింగ్‌తోనే ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి ఉంది. 2014లో తొలిసారి [more]

Update: 2020-11-30 02:00 GMT

ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన ఏలూరి సాంబ‌శివ‌రావు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రకోసం ప్లానింగ్‌తోనే ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి ఉంది. 2014లో తొలిసారి రంగంలోకి దిగిన ఏలూరి.. ఇక్కడ స్థానికంగా బ‌లంగా ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు.. కోట‌రీని ఛేదించి రికార్డు సృష్టించారు. గ‌త ఎన్నిక‌ల్లో దగ్గుబాటిని ఓడించ‌డం ద్వారా.. త‌న‌కు తిరుగులేద‌ని ఆయ‌న నిరూపించుకున్నారు. 2014లో తొలిసారి విజ‌యం సాధించిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డం ద్వారా ప్రజ‌ల‌కు చేరువయ్యారు. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్యల‌ను కూడా ఆయ‌న ప‌రిష్కరించారు. ఈ క్రమంలో రైతుల‌కు ఆప‌ద్భాంధ‌వుడిగా ఏలూరి సాంబ‌శివ‌రావు మంచి గుర్తింపు పొందారు.

వ్యక్తిగత ఇమేజ్ తోనే….

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఏలూరి సాంబ‌శివ‌రావు గెలుపు ప‌రుచూరు రాజ‌కీయాల్లో చెర‌గ‌ని అధ్యాయంగా మారింద‌న‌డంలో సందేహం లేదు. ఒక‌వైపు జ‌గ‌న్ సునామీ.. మ‌రోవైపు ప్రభుత్వ వ్యతిరేక‌త అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్రభావం చూపించాయి. అయితే ప‌రుచూరులోమాత్రం వ్యక్తిగత ఇమేజ్‌తో త‌న గెలుపును తానే నిర్ణయించుకున్నారు ఏలూరి. బ‌ల‌మైన ద‌గ్గుబాటిని ఓడించ‌డం ద్వారా.. టీడీపీకి చిర‌స్థాయిగా ఇక్కడ పునాదులు ప‌దిలం చేశారు. ఈ గెలుపుతో ఏలూరిలో కొత్త హుషారు వ‌చ్చింది. ఇదిలావుంటే, చంద్రబాబు ఇటీవ‌ల పార్టీ పార్లమెంట‌రీ ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడు.. బాప‌ట్ల పార్లమెంటు పార్టీ అధ్యక్షుడుగా ఏలూరిని ఎంపిక చేశారు.

ప్రజల వద్దకే వెళ్లి….

బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డంతోపాటు.. నాయ‌కులను ముందుండి న‌డిపించే బాధ్యత కూడా ఏలూరి సాంబ‌శివ‌రావు భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో ఆయ‌న త‌న వ్యూహానికి ప‌దును పెట్టారు. ఆఫీస్‌లో ఏసీ గ‌దిలో కూర్చుని.. ప్రజ‌ల‌కు ప్రక‌ట‌న‌లు జారీ చేయ‌డం ద్వారా ఎలాంటి లాభం లేద‌నుకున్నారు. అందుకే ఎన్నిక‌ల‌ప్పుడే నేత‌లు బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న నానుడికి భిన్నంగా ఆయ‌న ఇప్పటి నుంచే ప్రజ‌ల్లో ఉంటున్నారు. ప్రజ‌ల స‌మస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజ‌ల ఇళ్లకే వెళ్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ర‌చ్చబండ స‌భ‌ల‌తో ప్రజ‌ల్లోకి వెళ్లి వారి స‌మ‌స్యలు తెలుసుకుంటున్నారు. ఆయ‌న ప్రతిప‌క్ష ఎమ్మెల్యేగా ఉన్నా త‌న వంతుగా స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తున్నారు.

మిగిలిన వారు సైలెంట్ అయినా….

ఈ దూకుడు.. నిత్య ప్రజ‌ల్లో ఉండ‌డ‌మే ఆయ‌న్ను ప్రకాశం టీడీపీలో హీరోను చేసింది. జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హ‌వా చెలాయించిన నేత‌లు అంద‌రూ సైలెంట్ అయిపోయారు. సిద్ధా, క‌ర‌ణం ఫ్యామిలీలు వైసీపీలో చేరిపోయాయి. గొట్టిపాటి పూర్తి సెలెంట్ అయ్యారు. గ‌తంలో యాక్టివ్‌గా ఉన్న దామ‌చ‌ర్ల లాంటి నేత‌ల‌ను బాబు రాష్ట్ర క‌మిటీలో తీసుకున్నారు. ఇక ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌లు అంద‌రూ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఏలూరి సాంబ‌శివ‌రావు మాత్రం నిరంత‌రం ప్రజ‌ల‌కు, పార్టీకి ట‌చ్‌లో ఉంటున్నారు. ఏలూరి ఇదే దూకుడు, గ్రాఫ్ కంటిన్యూ చేస్తే ఆయ‌న ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కీల‌క నేత‌గా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News