తిరుపతిలో టీడీపీ గెలిస్తే ఇదే కారణమా?

తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ గెలవాలని భావిస్తుంది. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ముందుగానే అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించారు. గతంలో [more]

Update: 2020-12-21 03:30 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ గెలవాలని భావిస్తుంది. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ముందుగానే అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముందుగానే ప్రకటించి చంద్రబాబు పార్టీ నేతలను సయితం ఆశ్చర్యంలో ముంచెత్తారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తా తగ్గిపోలేదని నిరూపించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

రంగంలోకి రాబిన్ శర్మ….

ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకున్నారు. వచ్చే ఎన్నికలకు కూడా రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. అయితే చంద్రబాబు కోరిక మేరకు రాబిన్ శర్మ తిరుపతి ఉప ఎన్నికకు వ్యూహకర్తగా పనిచేయనున్నారు. ఈమేరకు రాబిన్ శర్మ బృందం తిరుపతి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ బలాలను, బలహీనతలను రాబిన్ శర్మ బృందం పరిశీలించనుంది.

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో…..

రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేశారు. ఆయనకున్న అనుభవాన్ని తిరుపతి ఉప ఎన్నికలో ఉపయోగించనున్నారు. ఇప్పటికే రాబిన్ శర్మ బృందం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అక్కడి ప్రజల సమస్యలతో పాటు పార్టీకి బలాబలాలను తెలుసుకోనుంది. నెలలోపు చంద్రబాబుకు రాబిన్ శర్మ బృందం నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది.

నెలలో నివేదిక….

ప్రధానంగా తిరుపతి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాలపైనే రాబిన్ శర్మ బృందం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు చంద్రబాబు ప్రచారం చేయాల్సిన ప్రాంతాలను కూడా రాబిన్ శర్మ బృందం ఎంపిక చేయనుందని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించి జగన్ కు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. మరి రాబిన్ శర్మ సక్సెస్ అవుతారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News