అనుకున్నది ఏదీ జరగడం లేదే?

ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీడీపీ అనేక ఆశలు పెట్టుకుంది. అయితే ఈ ఆశలేమీ నెరవేరేటట్లు కనపడటం లేదు. ప్రధానంగా [more]

Update: 2020-12-26 14:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీడీపీ అనేక ఆశలు పెట్టుకుంది. అయితే ఈ ఆశలేమీ నెరవేరేటట్లు కనపడటం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, దానికి వత్తాసు పలికే ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. అయితే వీటిలో ఎలాంటి పస లేదన్నది తేలిపోయింది. తాజాగా ఇప్పుడు మరోసారి రిఫరెండం డిమాండ్ ను టీడీపీ ముందుకు తెచ్చింది.

వీక్ చేసేందుకు…..

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తమను టార్గెట్ చేస్తుండటం, తమ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చారు. వైసీపీని మానసికంగా వీక్ చేసేందుకు, టీడీపీలో జోష్ నింపేందుకు ఆయన కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ప్రజాప్రతినిధులపై కేసులన్నింటినీ సత్వరం పరిష‌్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానిని తనకు అనుకూలంగా మలచుకున్నారు.

జైలుకు వెళ్లడం ఖాయం….

జగన్ సీబీఐ నమోదు చేసిన కేసుల్లో తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమని పదే పదే ప్రచారం చేశారు. ఈ కేసుల్లో జగన్ కు జైలు శిక్ష పడుతుందని, ముఖ్యమంత్రిగా భారతిని నియమించనున్నారని వదంతలు సృష్టించింది. అంతేకాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని, ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని కూలదోయనున్నారని కూడా పెద్దయెత్తున ప్రచారం చేశారు. అయితే ఇవేమీ జరగకపోవడం, జరిగేది కాదని తెలియడంతో ఆ విషయాన్ని ప్రస్తుతం టీడీపీ నేతలు పక్కన పెట్టారు.

జమిలితో పాటు రెఫరెండం….

తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద జమిలి ఎన్నికల ప్రస్తావన పదే పదే తెచ్చారు. జమిలి ఎన్నికలు త్వరలోనే రానున్నాయని, సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పదే పదే పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు రెఫరెండం అని మళ్లీ పల్లవిని అందుకున్నారు. దీంతో చంద్రబాబు, ఆయనకు చెందిన ఎల్లోమీడియా జగన్ పై చేసిన, చేస్తున్న ప్రచారానికి విలువ లేకుండా పోయింది. విశ్వసనీయత లేదు. దీంతో చంద్రబాబు పూటకొక్క అంశాన్ని లేవనెత్తుతూ జగన్ ను ఇరకాటంలో పెట్టాలనే దానికన్నా తన పార్టీని గాడిలో పెట్టాలన్న దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారన్నది వాస్తవం.

Tags:    

Similar News