ఏ క్షణమైనా ఏపీ లో ఎన్నికలు …?

మార్చి నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను తప్పనిసరిగా పూర్తి చేయాలిసిన పరిస్థితి ఎపి సర్కార్ పై పడింది. ఈనెల 31 వ తేదీ లోపు స్థానిక ఎన్నికలు పూర్తి [more]

Update: 2020-03-01 06:30 GMT

మార్చి నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను తప్పనిసరిగా పూర్తి చేయాలిసిన పరిస్థితి ఎపి సర్కార్ పై పడింది. ఈనెల 31 వ తేదీ లోపు స్థానిక ఎన్నికలు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 ఆర్ధిక సంఘం నుంచి రావాలిసిన నిధులకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన 59 శాతం రిజర్వేషన్ల అంశం పై తీర్పును హై కోర్టi రిజర్వ్ చేసి ఉంచింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తం అయిపొయింది.

అసలే ఆర్ధిక స్థితి ..

రిజర్వేషన్లపై తీర్పు ఎలా వచ్చినా దానికి అనుగుణంగా తక్షణ ఎన్నికలకు ఈసి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఏపీ లోని పంచాయితీలు, మునిసిపాలిటీ, కార్పొరేషన్ లకు సంబంధించి అన్ని లెక్కలతో అధికార యంత్రాంగం సమాయత్తం అయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి దినదినగండంగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14 ఆర్ధిక సంఘం విడుదల చేసే 3 వేలకోట్ల రూపాయలకు పైబడి నిధులు వెనక్కి పోతాయి. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లే.

ఎట్టి పరిస్థితుల్లో…..

దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలనేది జగన్ సర్కార్ సంకల్పం గా వుంది. వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న 59 శాతం రిజర్వేషన్లు కి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ నడిపించేయాలన్నదే సర్కార్ ఆలోచనగా తెలుస్తుంది. అందువల్లే ప్రభుత్వ సంక్షేమ పథకాల జోరును బాగా పెంచారని తెలుస్తుంది. ఇప్పటికే టిడిపి ప్రజాచైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్ళింది. బిజెపి, జనసేన జట్టుగా స్థానిక ఎన్నికలకు రెడీ అని ప్రకటించేశాయి. ఇక కోర్టు తీర్పు వెలువడటమే తరువాయి అంటుంది అధికారపార్టీ.

Tags:    

Similar News