వారికి డౌటు కొడుతుందట

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఏర్పాటైన తరువాత జరిగినవి ఒకే ఒక్క ఎన్నికలు. 2005లో జీవీఎంసీ గా కార్పొరేషన్ పదోన్నతి చెందింది. అప్పట్లో వైఎస్సార్ [more]

Update: 2019-09-17 00:30 GMT

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఏర్పాటైన తరువాత జరిగినవి ఒకే ఒక్క ఎన్నికలు. 2005లో జీవీఎంసీ గా కార్పొరేషన్ పదోన్నతి చెందింది. అప్పట్లో వైఎస్సార్ సర్కార్ కేంద్ర నిధులు దండిగా వస్తాయని చుట్టు పక్కల శివారు ప్రాంతాలను, మునిసిపాలిటీలను కలుపుకుని జీవీఎంసీగా చేశారు. ఆ తరువాత 2007లో జరిగిన ఎన్నికల్లో అనుకున్నట్లుగానే కాంగ్రెస్ గెలిచింది. 2012 వరకూ ఆ పాలకవర్గం పనిచేసింది. నాటి నుంచి నేటి వరకూ అంటే ఏడేళ్ళుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే జీవీఎంసీ ఉంది. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలు కూడా వచ్చి దిగిపోయాయి. వార్డుల్లో అధికారుల పాలన తప్ప ప్రజాప్రతినిధులు విశాఖకు లేరన్న కొరత అలాగే ఉంది. ఇపుడు ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మరి ఎన్నికలు జరిపిస్తారా అంటే డౌటేనని అంటున్నారు.

కోర్టు గొడవలు అలాగే….

జీవీఎంసీలో మరిన్ని ప్రాంతాలు, మునిసిపాలిటీలు వైఎస్సార్ ఉన్న టైంలోనే విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో అతి పురాతనమైన, దేశంలోనే రెండవ మునిసిపాలిటీగా ఉనన్ భీమునిపట్నం కూడా జీవీఎంసీలో చేరిపోయింది. దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లారు, అలాగే, అనకాపల్లి మునిసిపాలిటీని కూడా కలిపేశారు. దాని విషయంలోనూ అభ్యంతరాలు బాగా ఉన్నాయి. దాంతో ఎన్నికలు జరిపించేందుకుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని అంటున్నారు. గతంలో టీడీపీ సర్కార్ ఎన్నికలు జరపాలని చూసినా కోర్టు కేసులు కొలిక్కి రాకపోవడం వల్లనే వదిలేశారని అంటున్నారు. ఇపుడు కూడా అవి అలాగే ఉన్నాయి మరి దీని మీద మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కోర్టు గొడవలు ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూస్తున్నామని అన్నారు. అయితే అవి కోర్టుల్లో ఉండడం వల్ల పాలకులు ఏమీ చెయలేరు. ఆయా పార్టీలతో బయట మాట్లాడి ఒప్పించి కేసులు విత్ డ్రా చేయించాలి.

అది జరిగే పనేనా…?

ఇపుడున్న పరిస్థితుల్లో రాజకీయ నేపధ్యంలో కోర్టులకు వెళ్లిన వారు వెనక్కు రాకపోతే మాత్రం జీవీఎంసీ ఎన్నికలు డిసెంబర్లో జరిగే అవకాశాలు అయితే లేవు. ఇక రాజకీయపరంగా చూసుకున్నా కూడా వైసీపీకి విశాఖ అర్బన్ జిల్లాలో అనుకున్నంత బలం లేదు. అక్కడ నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ పరం అయ్యాయి. అన్ని అడ్డంకులు దాటుకుని, కోర్టు కేసుల చిక్కుముడులు విప్పినా కూడా వైసీపీ గెలుస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా టీడీపీ నుంచి నాయకులకు వైసీపీ ఎర వేస్తోంది. అదే కనుక జరిగితే వారిని చేర్చుకుని బలోపేతమై అపుడు ఎన్నికలకు సిధ్ధపడాలనుకుంటోంది. ఈ లోగా న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తోంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే డిసెంబర్ లో జరిగే ఎన్నికల జాబితాలో జీవీఎంసీ ఉండదన్న మాట మాత్రం కచ్చితంగా వినిపిస్తోంది. మరి చూడాలి.

Tags:    

Similar News