శ్రీకాకుళం ఎంపీ కోసం దువ్వాడ తోడల్లుడు రెడీ ?

రాజకీయాలు ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారు తమ జీవిత కాలం లక్ష్యంగా రాజకీయాలనే ఎంచుకుంటున్నారు. శ్రీకాకుళం ఎంపీగా టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహననాయుడు [more]

Update: 2021-04-17 03:30 GMT

రాజకీయాలు ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారు తమ జీవిత కాలం లక్ష్యంగా రాజకీయాలనే ఎంచుకుంటున్నారు. శ్రీకాకుళం ఎంపీగా టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహననాయుడు నెగ్గి గట్టిగా రెండేళ్ళు కూడా కాలేదు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నుంచి పలువులు నేతలు ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసేస్తున్నారు. జగన్ మదిలో ఎవరు ఉన్నారో కానీ తమకూ ఒక చాన్స్ అంటూ కొత్త వారు కూడా రెడీ అయిపోతున్నారు.

తోడల్లుడికి పోటీగా…

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పడి లేచిన కడలి తరంగం లాంటి వారు. ఆయన కాంగ్రెస్ నుంచి ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రజారాజ్యంలో లక్ సరిచూసుకున్నా చివరిని వైసీపీలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలా దశాబ్దాలుగా అలుపెరగని పోరు చేసిన ఆయన ఇన్నేళ్ళకు చట్ట సభల మెట్లు ఎక్కబోతున్నారు. ఇపుడు ఆయన ఇంట్లోనే ఉన్న డాక్టర్ తోడల్లుడికి ఎంపీ కావాలని కోరిక పుడుతోందిట. ఆయన వైద్యుడిగా శ్రీకాకుళంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వైసీపీలో కూడా కీలక నేతగా ఉన్నారు. అయితే ఇపుడు ఆయన రాజకేయంగా కీలకంగా ఉండాలనుకుంటున్నారుట.

రాజకీయ వైద్యునిగా….

వృత్తిపరంగా డాక్టర్ అయిన దానేటి శ్రీధర్ రాజకీయాల్లో వెలుగొందాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయనది రాజకీయ కుటుంబం కావడం వల్లనే ఈ కోరిక పుట్టింది అనుకోవాలి. ఆయన మామ సంపతిరావు రాఘవరావు ఎంపీపీగా పనిచేశారు. ఇక తోడల్లుడు దువ్వాడ శ్రీనివాస్ ఎటూ శ్రీకాకుళం రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో ఉన్న పరిచయాలతో తాను ఎంపీ అభ్యర్ధిని కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

ఆమెతో పోటీ ….

నిజానికి జగన్ మదిలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఆమెనే జగన్ నిలబెట్టారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి తాను ఢిల్లీలో ఉండాలనుకుంటున్నారు. దాంతో ఆమె ఇప్పటికే జగన్ తో తన విన్నపాన్ని చెప్పి ఓకే చేయించుకున్నారని అంటున్నారు. ఇక శ్రీకాకుళం ఎంపీ విషయంలో జగన్ చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవడంలేదు అక్కడ వెలమలు, కాళింగులు,కాపులు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నారు. ఒకసారి కాపులకు, మరోసారి కాళింగులకు జగన్ ఎంపీ టికెట్లు ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. దాంతో మరోమారు కాపు కార్డుని ఆయన వాడాలనుకుంటున్నారు. కాళింగులు అయితే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారణి వైపు చూస్తారని అంటున్నారు. మరి రాజకీయంగా జూనియర్ అయిన డాక్టర్ దానేటి శ్రీధర్ తో జగన్ ప్రయోగం చేస్తారా అన్నదే ఇక్కడ చర్చ. పైగా అటు కింజరాపు రామ్మోహననాయుడు బలంగా పాతుకుపోయారు. దాంతో డాక్టర్ గారి పొలిటికల్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా. తోడల్లుడు తోడు వస్తారా. లేక షాక్ ఇస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉందిట.

Tags:    

Similar News