మత్తు డాక్టర్ ఎపిసోడ్ లో డిఫెన్స్ లో టీడీపీ ?

మత్తు డాక్టర్ టీడీపీ రాజకీయం పుణ్యమాని బాగా పాపులర్ అయిపోయారు. ఎంతలా అంటే మహానాడులో ఎన్టీఆర్ తో పాటుగా మత్తు డాక్టర్ సుధాకర్ పేరుని కూడా పదే [more]

Update: 2020-06-04 13:30 GMT

మత్తు డాక్టర్ టీడీపీ రాజకీయం పుణ్యమాని బాగా పాపులర్ అయిపోయారు. ఎంతలా అంటే మహానాడులో ఎన్టీఆర్ తో పాటుగా మత్తు డాక్టర్ సుధాకర్ పేరుని కూడా పదే పదే చంద్రబాబు తలచుకుంటూ ఆయన స్పూర్తి అన్నంతగా క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు, పెద్ద నాయకులు ఎంతో మంది ఉండగా కానిది మత్తు డాక్టర్ ని అడ్డం పెట్టుకుని వైసీపీ సర్కార్ ని ఫల్టీ కొట్టించామన్న ఆనందం టీడీపీది. ఈ ప్రభుత్వంపైన మాకు నమ్మకం లేదు. సీబీఐ విచారణను ఆదేశిస్తున్నామని మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో హై కోర్టు చేసిన కీలక కామెంట్స్ పసుపు పార్టీకి ఎంతగానే ఆనందం కలిగించాయనడంలో డౌటే లేదు.

రివర్స్ లో…..

ఇక మత్తు డాక్టర్ సుధాకర్ చదువు, హోదాని చూడాకుండా కేవలం దళిత కార్డుని అడ్డంపెట్టుకుని టీడీపీ రెచ్చగొట్టుడు రాజకీయం చేసింది. దానికి మద్దతుగా మిగిలిన విపక్షాలు కోరస్ పాడాయి. ఇపుడు రంగంలోకి దిగిన సీబీఐ తన విచారణలో భాగంగా మత్తు డాక్టర్ సుధాకర్ మీద కేసులు నమోదు చేసింది. పలు సెక్షన్లతో కేసులు పెట్టి రివర్స్క్ అటాక్ ఇచ్చింది. దాంతో ఆయనకు మద్దతుగా పెద్ద నోరు చేసుకున్న టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.

తప్పే కదా ….?

మత్తు డాక్టర్ సుధాకర్ లాక్ డౌన్ టైంలో విశాఖ వీధుల్లోకి వచ్చి వీరంగం చేయడం, ముఖ్యమంత్రి జగన్ ని, ప్రధాని మోదీని పట్టుకుని అసభ్యంగా దూషించడం, ఇతర ప్రజాప్రతినిధులను కూడా దారుణంగా తిట్టడం, పోలీసుల మీద కూడా తిట్లు అందుకోవడం, ఇక ఆ సమయంలో మద్యం సేవించినట్లుగా కూడా ఆధారాలు ఉండడంతో ఆయన మీద కేసులు సీబీఐ నమోదు చేసింది. పైగా లాక్ డౌన్ నిబంధనలు భాధ్యత కలిగిన డాక్టర్ ఉల్లంగించడం, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అదే సర్కార్ పెద్దలను దూషించడం అంటే ధిక్కారమేనని కూడా భావించి కేసులు పెట్టింది.

రెండవవైపు ….

ఇపుడు డాక్టర్ సుధాకర్ కేసులో రెండవ వైపు కూడా సీబీఐ విచారణలో బయటపడుతోంది. ఆయన ఏ పాపం ఎరగడని, అకారణంగా పెడ రెక్కలు విరిచేసి అరెస్ట్ చేశారని మొసలు కన్నీరు కార్చిన పసుపు తమ్ముళ్ళు ఇపుడు ఇరకాటంలో పడ్డారు. ఇక ఈ విషయం మీద ప్రజా వ్యాజ్యాన్ని వేసిన మాజీ ఎమ్మెల్యే అనిత సుధాకర్ వైపు జరిగిన తప్పులను ఏవీ చూపించకుండా వన్ సైడ్ కధే వినిపించారని అంటున్నారు. దీని మీద వైసెపీ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు వంటి వారు కూడా రెండవ వైపు వాదన వినాలని కూడా కోరుకున్నారు. ఇపుడు హైకోర్టు అదేశాల మేరకు సీబీఐ దర్యాప్తులో రెండవ కోణం కూడా బయటపడడంతో వైసీపీలో కొంత ఊరట కనిపిస్తోంది. అదే సమయంలో నిన్నటి దాకా టీడీపీలో ఎన్టీఆర్ తరువాత స్థానం ఇస్తూ ట్వీట్ల ద్వారా సుధాకర్ పేరుని పదే పదే తలచుకున్న పెదబాబు, చినబాబు సైతం ఇపుడు ఆయన్ని పక్కన‌ పెట్టాల్సివస్తోంది. మొత్తానికి బురదజల్లుడు రాజకీయంలో తమకు సాటి లేదని టీడీపీ మళ్ళీ నిరూపించుకుందని సీబీఐ దర్యాప్తు చూస్తే అర్ధమవుతోది.

Similar News