ట్రంప్ భయపడ్డారా? వాయిదాతో విజయం దక్కుతుందనా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన నాలుగేళ్లలో తీసుకున్న నిర‌్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికలను వాయిదా వేయాలంటూ ట్రంప్ చేసిన [more]

Update: 2020-07-31 17:30 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన నాలుగేళ్లలో తీసుకున్న నిర‌్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికలను వాయిదా వేయాలంటూ ట్రంప్ చేసిన ట్వీట్ సంచనలంగానే మారింది. ట్రంప్ ఎందుకిలా ట్వీట్ చేశారు? ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? లేక వాయిదా పడితే తనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందా? అన్న చర్చ జరుగుతోంది.

అనేక నిర్ణయాలు…..

అమెరికన్ ఫస్ట్ అన్న నినాదంతో గత ఎన్నికల్లో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి ట్రంప్ వచ్చాక వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా వలస విధానాలు, హెల్త్ పాలసీ వంటివి వాటితో ట్రంప్ పట్ల అననుకూలత ఏర్పడింది. మరోవైపు జార్జి ఫ్లాయిడ్ హత్య ట్రంప్ ప్రతిష్టను మరింతగా దిగజార్చింది. ఇప్పటికీ ఈ అంశం నానుతూనే ఉంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.

కరోనా తీవ్రత ఎక్కువగా…..

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవ్వడానికి, లక్షలాది మంది చనిపోవడానికి ట్రంప్ నిర్ణయాలే కారణమన్న అభిప్రాయం నెలకొంది. లాక్ డౌన్ ను సకాలంలో ప్రకటించకపోవడం, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా సీరియస్ గా తీసుకోక పోవడంతో అమెరికన్లు సయితం మండిపడుతున్నారు. కాగా అమెరికాలో అధ్యక్ష్య ఎన్నిక ప్రచారం ప్రారంభమయింది. గత కొద్దిరోజులుగా ట్రంప్ తో పాటు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ లు సయితం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఇప్పటి వరకూ దేశ చరిత్రలో…..

ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం చర్చనీయాంశమైంది. నిజానికి నవంబరు 3వ తేదీన అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకు ట్రంప్ తెలిపిన కారణం పోస్టల్ బ్యాలట్ నిర్వహిస్తే అవకతవకలు జరిగే అవకాశం ఉందనడం. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడలేదు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నవంబరు నెలలో మొదటి మంగళవారం ఎన్నికలు జరుగుతాయి. ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్నికలు వాయిదా పడలేదు. ట్రంప్ వాయిదా వేయమనడానికి కారణం ఓటమి భయమేనంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News